ట్రైన్ వస్తుండగా ఆడ శునకం కోసం మగ శునకం ఏం చేసిందో చూస్తే క‌న్నీరు ఆగ‌దు

305

ప్ర‌పంచంలో అన్నిటికంటే గొప్ప‌ది స్నేహం అనే చెప్పాలి.. ప్రేమ‌కంటే విలువైన‌ది స్నేహం అంటారు కొంద‌రు.. అది మ‌నుషుల‌కు అయినా జంతువులకి అయినా ఉంటుంది. స్నేహమంటే స్వార్థంగా మరుతున్న రోజుల్లో.. ఆ పదానికి అసలైన అర్థం చెప్పింది ఓ శునకం.. ప్రాణ స్నేహితుడి కోసం ప్రాణాలను పనంగా పెట్టింది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు.. మరోవైపు గజగజ వణికిస్తున్న చలి.. దీనికి తోడు చుక్‌ చుక్‌ మంటూ ఎదురుగా మృత్యువులా దూసుకొస్తున్న ట్రైన్లు.. అయినా బెదరలేదు.. స్నేహితుడిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించింది. స్నేహం.. ప్రపంచంలో ఓ అందమైన బంధం.. ప్రతి మనిషికి ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడు. ఒక వ్యక్తికి సంతోషంలోనూ.. కష్టంలోనూ నేనున్నాను అనే భరోసా ఇచ్చేది ఒక్క స్నేహితుడు మాత్రమే.. స్నేహితుల కోసం త్యాగాలు చేసిన ఎందరో గురించి వినే ఉంటాం.. అయితే కేవలం మనుషులే కాదు.. తమ స్నేహం కూడా వారికి ఏమాత్రం తీసుపోదని ఓ శునకం నిరూపించింది.


ఆడ శునకం ఓ రోజు గాయపడి రైలు పట్టాలపై పడిపోయింది. గమనించిన మరో మగ శునకం.. స్నేహితుడి బాధ చూసి విలవిలాడిపోయింది. అచేతన స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్న తన స్నేహితుడ్ని వదిలి వెళ్లలేకపోయింది మగ శునకం. తన స్నేహితుడ్ని ఎలా కాపాడుకోవాలి అని ఆరాటపడుతూ..రెండు రోజుల పాటు దట్టమైన మంచులోనే రాత్రింబవళ్లు తోడుగా ఉంది. స్నేహితుడు చలికి గజగజా వణుకుతుంటూ.. శరీరాన్ని వెచ్చగా చేసే ప్రయత్నం చేసింది. కదల్లేని పరిస్థితిలో ఉన్న స్నేహితుడుకి ఆహారం అందించింది. ట్రైన్‌ వస్తున్న శబ్ధం వినగానే.. స్నేహితుడికి అండగా.. పక్కనే పడుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైంది.

ఆ మార్గంలో రైళ్లు వస్తున్నా.. లెక్కచేయకుండా పట్టాలపైనే బిక్కుబిక్కుమంటూ స్నేహితుడి కోసం బెదరలేదు. ఈ హృదయవిదారక సన్నివేశాన్నిచూసిన స్థానికులు వాటి పరిస్థితిని గమనించి గాయపడిన శునకాన్ని రక్షించారు. ఈ రెండు శునకాలు ఉక్రైన్‌లోని ఒకే కుటుంబానికి చెందినవట. కాగా, ట్రాక్‌పైన కుక్కల పరిస్థితిని డెనీస్‌ అనే వ్యక్తి వీడియో తీసి నెట్‌లో పెట్టాడు. ఈ వీడియో నెట్‌లో వైరల్‌ అయింది. ప్రస్తుతం ఈ శునకాలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. స్నేహం ముందు ఏదీ నిలువదని ఈ శునకాలు మరోసారి రుజువు చేశాయి. మ‌రి వీరి స్నేహం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి..