బోటు ముందు భాగం మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చింది మ‌ళ్లీ ఎదురుదెబ్బ

593

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్‌కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్‌ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు ఆచూకీ తెలియని వారి కుటుంబాల్లో ఉద్వేగం నెలకొంది. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. నదీ గర్భంలో ఉన్న బోటుకు తాళ్లు బిగించారు. ఉద‌యం ప్రొక్లెయిన్లతో బయటకు లాగడానికి ప్ర‌య‌త్నించారు..

Image result for godavari boat

ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ ఒక ఎత్తైతే.. నదిలో ఉన్న బోటు దగ్గరికి వెళ్లి.. దానికి తాళ్లు బిగించడం మరో ఎత్తు. ఆదివారం ఆపరేషన్‌లో.. ఈ స్టేజ్‌ను విశాఖ సీ డైవర్స్ పూర్తి చేశారు. నదీ గర్భంలో ఉన్న బోటు ముందు భాగానికి.. ఐరన్ రోప్స్ కట్టారు. బోటు వెనుక భాగంలో తాళ్లు బిగించారు. తర్వాత.. ప్రొక్లెయిన్లతో బోటును ఒడ్డుకు లాగారు.ఈరోజు సాయంత్రానికి బోటు బయటకు వస్తుందని ధర్మాడి సత్యం బృందం, డీప్ సీ డైవర్స్ అంచనా వేస్తున్నారు.

Related image

అయితే అనూహ్యంగా బోటు ఎదుర‌భాగం బ‌య‌ట‌కు వ‌చ్చింది..బోటు ముందు ఉండే ఐర‌న్ ఫెన్షింగ్ మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చింది.. దీంతో వారు అనుకున్న విధంగా బోటు బ‌య‌ట‌కు రాలేదు, అయితే బోటు నిండా బుర‌ద నీరు మ‌ట్టి పేరుకుపోయి ఉంటుంది కాబ‌ట్టి రావ‌డం చాలా క‌ష్టం అని చెబుతున్నారు.. నదీ గర్భంలో ఉన్న బోటు ముందు భాగానికి.. ఐరన్ రోప్స్ కట్టారు. బోటు వెనుక భాగంలో తాళ్లు బిగించారు. అయినా ముందు భాగానికి రోప్స్ వ‌ల్ల అది ఐరెన్ ఫెన్షింగ్ ల‌ను తెంపుకుని మ‌రీ బ‌య‌ట‌కు వ‌చ్చింది.. కాని లోప‌ల నుంచి మాత్రం బోటు ఇంకా రావాల్సి ఉంది, అయితే మ‌రోసారి ప్ర‌యత్నం చేస్తాము అని ధ‌ర్మాడి టీం చెబుతోంది.

ఈ క్రింద వీడియో చూడండి

మరోవైపు వరద కారణంగా.. బోటులో బాగా బురద చేరింది. సాధారణంగా బోటు 40 టన్నులు ఉంటుందని.. ఇప్పుడు మట్టి చేరడంతో మరింత బరువు పెరిగింది. అంతటి బరువైన బోటును ఒడ్డుకు చేర్చడంపైనే ధర్మాడి సత్యం టీమ్ దృష్టి పెట్టింది.మొత్తం పది మంది డైవర్లలో ఇద్దరు నది అడుగు భాగంలోకి వెళ్లి పరిస్థితి గమనించారు. బోటు మునిగిన ప్రాంతంలో నదీ గర్భం “V” ఆకారం లో ఉందని తెలిపారు. ఐరన్ రోప్ తీసుకుని బోట్‌ చుట్టూ కట్టేందుకు డైవర్లు మళ్లీ నీటిలోకి వెళ్లారు.ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉండగా.. మరో ఇరవై మీటర్ల మేర ఒడ్డు వైపు లాక్కొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చని చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ రోజు సాయంత్రమే బోట్ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి