ఈ స్మశానంలో అంద‌రూ వేశ్య‌లే రాత్రి 1గంట‌కు ఇక్క‌డ ఏం చేస్తారో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

225

భారత దేశం భిన్న మతాలు..భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. అందుకే ఇక్కడ రక రకాల వేషభాషలు ఉంటాయి..ఒక్కో ప్రాంతం వారు..ఒక్కో భాష..కట్టూ బొట్టు ఆచారాలు ఉంటాయి. పట్టణాల్లో..పల్లెల్లో కొన్ని ఆచారాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఆటవిక ఆచారాలు మరీ భిన్నంగా ఉంటాయి. అయితే కొన్ని ఆ ప్రాంత ప్రజలకు అది సర్వ సాధారణం కావచ్చు. ఇక హిందువులకు ఎంతో పవిత్రమైన వారణాసి లో అనాధిగా ఓ వింత ఆచారం ఆచరణలో ఉంది. ఇది వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా..అక్కడి వారికి ఇది సర్వసాధారణం అంటారు.ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలుసా.. దహనసంస్కారాలు జరిగే శ్మశాన వాటికలో నృత్యాలు చేయడం..అది కూడా వెశ్యలు. సాధారణంగా స్మశానం అంటే..చుట్టు నిర్మాణుషం..ఆ చుట్టు పక్కలకు వెళ్లాలంటేనే ఎవరికీ ఇష్టం ఉండదు.

ఈ క్రింది వీడియో చూడండి

కానీ అక్కడ మాత్రం ప్రతి సంవత్సరం సప్తమి రోజు రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా నృత్యాలు చేయడం విశేషం. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద చైత్ర నవరాత్రి సప్తమి రోజు వెశ్యలు నృత్యాలు చేయడం అనాధిగా వస్తున్న ఆచారం. మణికర్ణిక ఘాట్ వద్ద వేశ్యలు చేసే నృత్యాన్ని ‘తపస్యా’ అంటారు. ఆ రోజున వేశ్యలు ఘాట్ దగ్గరకు వచ్చి బాబా ముందు తన్మయత్వంతో నృత్యం చేస్తారు. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది..మణికర్ణిక ఘాట్ వద్ద పార్వతికి దూరమైన మహాశివుడు తాండవ నృత్యం చేశాడని పురాణాల్లో చెబుతారు. ఆ తర్వాత అక్బర్ నవరత్నాల్లో ఒకరిగా ప్రఖ్యాతి గాంచిన రాజా మన్ సింగ్….16వ శతాబ్దంలో ఈ ఘాట్ లో శివుడికి ఓ ఆలయాన్ని నిర్మించి స్వామికి అంకితం చేశారట.

ఇదో వింత ఆచారం..అక్కడ వేశ్యలు డ్యాన్స్ చేయడం సాంప్రదాయం..!

అప్పట్లో అక్కడ సంగీత విభావరి నిర్వహించేవారట. కాకపోతే..అది స్మశానం కావడం..శవాల మద్య నృత్యం చేయడానికి ఎవరూ సాహసించలేక పోయారట..దాంతో అక్కడికి వేశ్యలు వచ్చి నృత్యం చేశారట. అప్పటి నుంచి ఇదే సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ప్రతి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు చేస్తుంటారు..ఇది తిలకించడానికి వేల మంది వస్తుంటారు. ఈ నాట్యం కూడా డబ్బుకోసమే..ఆనందం కోసమో కాదట..తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం కోరుతూ మహా శంషాన్ బాబా ముందు నృత్యం చేసి పాప ప్రక్షాళన పొందుతారట..దీని వల్ల వారి శేష జీవితం ఆనందంగా గడిపే అవకాశం వస్తుందని నమ్మకమట.మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి