భారత ఓటమి తట్టుకోలేక రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో ఏం చేసాడో తెలిస్తే కన్నీళ్ళే

91

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి వరకు పోరాడినా.. కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టగా మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది. జడేజా కెరీర్లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 77 పరుగులు చేసిన జడ్డూ ఔటయ్యాక.. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం అయ్యాయి. ఓ ఎండ్‌లో ధోనీ ఉండటంతో గెలుస్తాంలే అనే ధీమా అభిమానుల్లో కనిపించింది. 49వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన ధోనీ అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగుకు యత్నించాడు. కానీ దురదృష్టం కొద్దీ.. గుప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు మహీ బలయ్యాడు. దీంతో ఇండియా ఓడిపోయింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ ఓటమి అందరి కంటే ఎక్కువగా రోహిత్ శర్మను బాధపెడుతోంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. అతను ప్రతి మ్యాచ్ తన శక్తిని మించి ఆడాడు. మొత్తం ఐదు సెంచరీలు చేశాడంటేనే అర్థం చేసుకోండి రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా ఈ వరల్డ్ కప్ ను ఆడాడో. అయితే అతను ఆడని ఈ సెమిస్ మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే మ్యాచ్ ఓడిపోయి వరల్డ్ కప్ నుంచి నిష్రమించినందుకు రోహిత్ చాలా బాధపడుతున్నాడు. ధోని అవుట్ అయినా వెంటనే ఇక మ్యాచ్ చేజారిపోయిందని గ్రహించిన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లకముందే ధోని అవుట్ అయినప్పుడే రోహిత్ కంటతడి పెట్టుకున్నాడు. అతను ఏడవడం కెమెరాలలో కూడా రికార్డ్ అయ్యింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి మరింత ఏడ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అతను ఎంతాగానమో ఇష్టపడే అతని బ్యాట్ ను నేలకేసి కొట్టాడంట. ఈసారి కప్ సాధించాలని రోహిత్ అనుకున్నాడు. కానీ సెమిస్ లోనే ఇంటికి వచ్చేసింది.

Image result for rohit sharma crying in dressing room

ఇక రోహిత్ పరిస్థితి గురించి సచిన్ కూడా స్పందించాడు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ….టీమిండియా ఇలా టోర్నీ నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేకపోతున్నాం. రోహిత్‌శర్మ పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోహిత్‌ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అతడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రపంచకప్‌పై అభిమానులందరూ ఎన్నో కలలు కన్నారని, ప్రతీ ఒక్కరికీ ఇది గడ్డు కాలం. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి బాధగా ఉన్నా 240 పరుగుల టార్గెట్‌ ఛేదించదగినదే. జట్టు సభ్యులకే కాదు ఇతర స్టాఫ్‌ కూడా చాలా బాధపడతారు. టోర్నీ కోసం ఎన్నో రోజులు శ్రమించి ఉంటారు. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ప్రతీ ఆటగాడికీ కొంత సమయం పడుతుంది. అన్ని గాయాలకు సమయమే సరైన చికిత్స. ఒక భారతీయుడిగా నాకు ఈ ఫలితం నిరాశ కలిగించింది అని సచిన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి భారత్ ఓటమి మీద రోహిత్ పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.