లేటు వయసులో ఘాటు ప్రేమికులు… 65 ఏళ్ల రిటైర్డు ప్రధానోపాధ్యాయునితో 20 ఏళ్ల విద్యార్దిని వివాహం

332

ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు.. అయితే కళ్లు మాత్రమే కాదు వయసు కూడా లేదంటారు కొందరు ప్రేమికులు.. కేరళ రాష్ట్రాలకు చెందిన ఒక ప్రేమజంట గురించి చెప్తే మీరు షాక్ అవుతారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యవారే విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడం శోచనీయం.మనం ఇంతకముందు టీచర్ ను పెళ్లి చేసుకున్న స్టూడెంట్ అనే కాన్సప్ట్ లో అనేక ఘటనల గురించి విన్నాం.ఇప్పుడు అలాంటి ఒక ఘటనే వెలుగులోకి వచ్చింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

పంజాబ్‌ రాష్ట్రంలోని అపోకర్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జయ్‌కృష్ణన్‌ (65) తన వద్ద ట్యూషన్‌ వచ్చే మగత్‌ (20) అనే విద్యార్థినిపై మమకారం పెంచుకున్నాడు. భార్య చనిపోగా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కలిగి ఉన్న జయ్‌కృష్ణన్‌ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో మగత్‌ను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. రిటైరైన తరువాత కూడా మగత్‌కు ఆర్థిక సహకారం చేయడం, ఇంటికి పిలిపించుకుని మరీ ట్యూషన్లు చెప్పడం, ఇద్దరూ కలిసి భోంచేయడం పరిపాటిగా తయారై ప్రేమగా మారింది.ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకుని రహస్య కాపురం సాగిస్తున్న విషయం బయటపడింది. ఎన్నాళ్లీ దొంగకాపురం, స్వేచ్ఛగా కలిసి జీవిద్దామనే ఆలోచనతోనే పంజాబ్‌ నుంచి పారిపోవాలనుకున్నారు.ఈనెల 11వ తేదీన జయకృష్ణన్‌ రూ.25వేల తన పింఛన్‌ సొమ్ముతోపాటు ఇంటిలోని నగదును తీసుకురాగా ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ రెండురోజుల క్రితం తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. తండ్రి, కుమార్తెలమని చెప్పి ప్రయివేటు అతిథిగృహంలో రూము తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పంజాబ్, రామేశ్వరం పోలీసులకు బుధవారం వారు పట్టుబడ్డారు.

మాది పవిత్రమైన ప్రేమ.. తప్పుపట్టే పని మేం చేయలేదని వారిద్దరూ పోలీసుల వద్ద సమర్థించుకున్నారు. ‘‘శారీరక సుఖం కోసం మగత్‌ను పెళ్లి చేసుకోలేదు, భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాపై మగత్‌ అత్యంత అభిమానం చూపించింది. ఇదే మాఇద్దరి మధ్య ప్రేమకు కారణం’’ అని జయకృష్ణన్‌ చెప్పాడు. ‘‘చిన్నవయసు నుంచే నా పట్ల చూపిన ఆదరణే జయకృష్ణన్‌ అంటే విలువపెంచేలా చేసింది. కాలక్రమేణా నాకు తెలియకుండానే ఆయనంటే ప్రేమ ఏర్పడింది. నా ప్రేమ తప్పని తెలిసినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. బతికితే అతనితోనే బతుకుతాను, భర్తను నా నుంచి విడదీయవద్దు’’అని పోలీసుల వద్ద మగత్‌ పెద్దగా విలపించింది. పంజాబ్‌కు వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళితే తమని చంపేస్తారని, తాను మేజర్‌ను కావడం వల్ల ఎవరితోనైనా జీవించే హక్కు తనకుందని మగత్‌ పోలీసుల వద్ద వాదించింది. అయితే వారిద్దరినీ పంజాబ్‌ పోలీసులకు అప్పగించాలని రామేశ్వరం కోర్టు తీర్పు చెప్పడంతో విధిలేక తిరుగు ప్రయాణమయ్యారు.మరి అక్కడికి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఈ అమర ప్రేమికులు.చూశారుగా 65 ఏళ్ల టీచర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విద్యార్థిని గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.