కలెక్షన్స్ కింగ్ ఎవరు.? ఎన్ని కోట్లు తేడానో చూస్తే షాకే.!

341

ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. తొలి రోజు దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజైన ప్రతీ చోట 95 శాతానికి పైగా అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శంకర్ విజన్, ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసింది.మొదటిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.మరి మొదటిరోజు ఎంత రాబట్టిందో చూద్దామా.

2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శించారు.. రిలీజైన ప్రతీ చోట మంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నది. 2.0 చిత్రం బాహుబలి2 స్క్రీన్లను అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్లలో రిలీజై ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పలురికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం 2.0 చిత్రం కూడా భారీగానే రిలీజైంది.అందుకు తగ్గట్టుగానే భారీ వసూలు సాధించింది.

ఒకరోజు ముందే యూఎస్ లో ప్రభంజనం మొదలుపెట్టిన 2.ఓ ఇండియా మొత్తం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియంలో భారీ స్థాయిలో 4 మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసిన 2.ఓ ఇండియాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అల్లకల్లోలం స్పృష్టిస్తుంది. అన్ని వెర్షన్స్ ను కలిపి యూఎస్ ఇండియాలో కలిసి ప్రీమియం షో 31 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక మొదటిరోజు మొత్తం తమిళనాడు కర్ణాటక ఎపి తెలంగాణ కేరళ రాష్టాలతో పాటు మిగతా నార్త్ స్టేట్స్ కలిపి 130 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. టాలీవుడ్ లో బాహుబలి రంగస్థలం భరత్ అను నేను చిత్రాల కలెక్షన్స్ ను అధిగమించింది. అరవింద సమెత వరల్డ్ వైడ్ గా 59 కోట్లు కలెక్ట్ చేసింది. యూఎస్ ప్రీమియం లో 6 కోట్ల 30 లక్షలు రాబట్టింది. భరత్ అను నేనుకు 49 కోట్ల గ్రాస్ వచ్చింది. రంగస్థలం సినిమా మొదటిరోజు కలెక్షన్స్ 42 కోట్లు మాత్రమే. కానీ 2.ఓ సినిమా మాట్నీ షో వరకే ఈ రికార్డ్స్ ను దాటేసింది.అలాగే బాహుబలి మొదటిరోజు 90 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ రికార్డ్ ను 2.ఓ దాటేసింది. చూడాలి మరి వీకెండ్స్ లలో ఎంత కలెక్ట్ చేస్తుందో.