కుటుంబం పై అలిగి బిచ్చగాడిలా మారిన కోటీశ్వరుడు.. ఎక్కడో తెలుసా..

1155

ఒక కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారాడు అంటే అందరు ఏమి అనుకుంటారు అతను చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చి లేదా చెడు వ్యసనాలు వల్ల లేదా అయినవారు వ్యాపారంలో మోసం చేయడం వల్ల ఇలా ఐపోయింటాడు అని అనుకుంటాం.లేదా ఈ మద్య మనం వింటున్న బిచ్చగాడి దీక్ష చేస్తున్నాడేమో అనుకుంటాం.కానీ ఇప్పుడు మేము చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు ఒక టాప్ వ్యాపారవేత్త తన కుటుంబం మీద కోపంతో బిచ్చగాడు అయ్యాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.మరి ఆ వ్యక్తికి అంత కోపం ఎందుకు వచ్చింది.ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో విల్లాపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ ఒక కోటీశ్వరుడు.తండ్రి కోట్ల ఆస్తి సంపాదించి ఇతనికి ఇచ్చాడు.అతనికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరు ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. కొన్ని నెలల క్రితం నటరాజన్ కు తన కోడలుతో గొడవ జరిగింది.ఈ గొడవలో కుటుంబ సభ్యులు కూడా కోడలికే సపోర్ట్ చేసారు.ఇంటి యజమానిగా అతనిని ఎవరు పట్టించుకోలేదు.దింతో నటరాజన్ భార్య మరియు పిల్లల పై అలిగి మనస్థాపంతో ఇంటి నుంచి బయటకి వచ్చేసాడు.ఇక ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కను అనుకుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.ఆయన అలాగే అంటాడు.రాత్రికి మళ్ళి ఇంటికే వస్తాడు అని కుటుంబ సభ్యులు కూడా అతనిని ఆపలేదు.అయితే ఆ రోజు ఇంటికి రాలేదు.ఎన్ని రోజులు అయినా సరే ఇంటికి రాలేదు.అతని కోసం అన్వేషించారు.

Image result for tamilnadu natarajan beggar

అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయినా నటరాజన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా..ఇంటి నుంచి బయటకి వచ్చి తిరుపూర్ మురుగన్ ఆలయంలో తలదాల్చుకున్నాడు.మూడు నెలల నుండి అక్కడే ఉంటూ ప్రసాదాలు తింటూ బ్రతికేస్తున్నాడు.అతను కోసం భార్య పిల్లలు వెతికి వెతికి చివరికి ఆదివారం తిరుపూర్ మురుగన్ ఆలయానికి వచ్చారు.భార్య మరియు పిల్లలకు నటరాజన్ బిక్షగాడి రూపంలో కనిపించాడు వెంటనే అతడి కుటుంబ సభ్యులు అతనిని క్షమించమని కోరి కారులో ఇంటికి తీసుకెళ్లారు.

ఇన్ని రోజులు గుడి ముందర బిక్షం ఎత్తుకున్న వ్యక్తి ఒక కోటీశ్వరుడు అని తెలుసుకొని గుడి దగ్గర ఉన్న స్థానికులు అంత ఆశ్చర్యపోయారు.వింటూనే మనకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది కదూ.అన్ని కోట్ల ఆస్తి ఉండి ఒక చిన్న కారణం వలన బిచ్చగాడిలా మారడంటే ఆశ్చర్యమే మరి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చిన్న గొడవకు కోట్ల ఆస్తిని వద్దనుకున్న నటరాజన్ గురించి అలాగే ఇలా విచిత్ర కారణాల వలన బిచ్చగాలుగా మారుతున్న వ్యక్తుల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

బాబు మోడీని క‌లిసిన‌ప్పుడు అవే అడిగేవారు పురందేశ్వ‌రి