థాయ్ పిల్లల్లో ఏంటా శక్తి : 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారో తెలుసా

535

Image result for thailand kids rescue operation

మ‌నం చాలా మంది సాధువుల‌ను చూస్తూ ఉంటాం సిద్దులు సాధువులు ఆహారం తీసుకోకపోయినా, కొన్ని వారాల పాటు ఉన్న సంగ‌తులు తెలుసు.. వారు క‌ఠోర దీక్ష‌తో శ్ర‌మిస్తూ అల‌వాటు చేసుకుంటారు ఆ అల‌వాటును… మ‌నం ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి అంటాం.. ఇక పిల్ల‌లు అయితే ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు . అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. తొమ్మిది రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఎలా బతికారు అనేది ఇప్పుడు ప్రతి ఇంట చర్చ అయ్యింది. ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. గుహ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన చిన్నారులు.. 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎలా ఉండగలిగారు.. వారిలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా.. ధ్యానం.. బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన ధ్యానం .. ఇదే ఆ పిల్లలను కాపాడింది. ధాన్యం చేసి పిల్ల‌లు త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు.

Related image

అండర్ 16 ఫుట్ బాల్ జట్టు. పిల్లలందరి వయస్సు 11 నుంచి 14 ఏళ్ల లోపే. వారికి ఫుట్ బాల్ కోచ్ గా ఎకపోల్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ధ సన్యాసి. అందులోనూ అనాథ. ఈ దేశం సమాజం కోసమే అంటూ బతికేస్తారు ఆయ‌న‌… చిన్న త‌నం నుంచి ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది…. అందులో భాగంగానే 25 ఏళ్ల వయస్సులోనే ఎకపోల్.. అండర్ 16 ఫుట్ బాల్ కోచ్ గా నియమితులు అయ్యారు. గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావటంతో లోపలే చిక్కుకుపోయారు ఈ గ్రూపు స‌భ్యులు అంద‌రూ. పిల్లలను బతికించేందుకే బౌద్ధ సన్యాసి, కోచ్ అయిన ఎకపోల్.. పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అని పాఠాలు చెప్పారు. ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశారు. ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవటం ద్వారా బతకొచ్చని.. పిల్లలతో ధ్యానం చేయించారు. కోచ్ ఎకపోల్ తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు పంచిపెట్టాడు. అందులో ఒక్క ముక్క కూడా అతను తీసుకోలేదు.

రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఉపయోగించుకుంటూ.. ఆందోళన దూరం చేస్తూ వారిని కాపాడారు. ఒక్క రోజు ఆహారం తీసుకోకపోతే రాత్రికి నిద్రపట్టదు.. రెండో రోజుకి డల్ అయిపోతాం.. అలాంటిది 11 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను తొమ్మిది రోజులపాటు ఆహారం లేకుండానే ప్రాణాలు పోశాడు అంటే ఇది ఖచ్చింతంగా వింతే అంటున్నారు…. నిజంగా కోచ్ ఎకపోలే ధ్యానంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. అత‌నికి అనిత‌ర‌సాధ్యుడు అని కితాబిస్తున్నారు అంద‌రూ… ఇక కోచ్ కు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.. అలాగే కోచ్ కు పిల్ల‌ల త‌ల్లి దండ్రులు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తమ పిల్ల‌ల ప్రాణాలు కాపాడిన దేవుడు అంటున్నారు… ఇక ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు… చూశారుగా ఆయ‌న ధ్యానంతో త‌నే కాదు, 11 మంది పిల్ల‌ల‌ను కూడా కాపాడారు.. ఈ కోచ్ చేసిన సాహ‌సానికి మీరు ఎటువంటి కితాబిస్తారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.