ఐదవ వారం భానుశ్రీ ఎలిమినేట్..కారణం ఇదే…

513

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఆదివారం నాటి 36వ ఎపిసోడ్ చాలా సరదాగా మొదలైంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు ఫుల్ క్లాస్ పీకిన నాని.. ఆదివారాన్ని మాత్రం ఫుల్ ఫన్‌గా మార్చారు. ఒక్కో ఇంటి సభ్యుడిని ఐస్ మీద నిలుచోబెట్టి మైమ్ ద్వారా పాటలను గెస్ చేసే టాస్క్ అదిరిపోయింది. ఐస్ మీద నిలుచుని పాటేంటో ఇంటి సభ్యులు, ఆ తరవాత నాని గ్రహించేలా చేయడానికి ఒక్కో ఇంటి సభ్యుడు పడే కష్టం నవ్వులు పువ్వులు పూయించింది. ఐస్ గేమ్‌లో ఒక్కో ఇంటి సభ్యుడిని నాని ఆటాడుకున్నారు. చివరిగా భానుశ్రీ ఎలిమినేషన్‌తో ఇంట్లో వాతావరణం మారిపోయింది.అయితే భానుశ్రీ ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for bigg boss bhanu sree

బిగ్ బాస్ లో అందరు అనుకున్నట్టే ఈ వారం భానుశ్రీ ఎలిమినేట అయ్యింది.వారం మొత్తం జరిగిన మంచి చెడుల రచ్చ అంతా ఇంతా కాదు.మంచి చెడుల టాస్క్ లో బాగంగా కౌశల్ యాపిల్ ను తీసుకోడానికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా కౌశల్ చేయి తన ప్రైవేట్ పార్ట్స్ లో తగిలిందని భాను నానా హంగామా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.
కావాలనే ముట్టుకున్నావు అని అనరాని మాటలు అన్నది.ఈమెకు సపోర్ట్ గా తేజస్విని కూడా కౌశల్ ను నానా మాటలు అన్నది.వాడు అంతే వాడి క్యారెక్టర్ అంతే అని కౌశల్ ను నానా మాటలు అన్నారు.ఈ విషయం మీదనే భానును నాని క్లాస్ పీకాడు.అతడి చేయి తగిలిందని చెప్పావు సరే. కాని, దానిపై 52 సెకన్ల తర్వాత నువ్వు స్పందించావు.అంటే అప్పటివరకు నీకు తెలియదా అతని చేయి తగిలిందని.అతడి చేయి తగిలిందా అని తేజస్వీని అడిగావు.

Image result for bigg boss bhanu sree

తేజస్వీ తగిలింది నేను చూశాను అనగానే నీ రియాక్షన్ మొదలైంది. అంటే అతని చేయి తగిలిందో నీకే క్లారిటీ లేదు.కానీ అతనిని నానా మాటలు అన్నావు.వాటిని పర్శనల్ ప్లేసులో పెట్టుకోవడం తప్పు కాదా? మనకు అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ఎందుకు పెట్టుకోవడం?సామ్రాట్‌ దీప్తిని ఎత్తుకుని తీసుకెళ్లడాన్ని తప్పుగా చూడలేదు. కానీ, కౌశల్ చేసినది తప్పంటున్నారు.ఈ ఒక్క ఎపిసోడ్ వలన నువ్వు ఎంత బ్యాడ్ అయ్యావో నీకు తెలుసా అంటూ భానును తిట్టాడు నాని.అయితే సోషల్ మీడియా లో కౌశల్ ఫాన్స్ భానును టార్గెట్ చేశారు.ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి భానుశ్రీకి ఓటు వెయ్యొద్దు అని కాంపైన్ చేశారు.ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది.అందుకే ఈ వారం భానుశ్రీ ఎలిమినేట్ అయ్యింది.అనవసరంగా నోరు జారి ప్రేక్షకుల మదిలో చులకన అయ్యింది.

కౌశల్ లాంటి జేన్యున్ పర్సన్ మీద కామెంట్స్ చేసినందుకే ఇప్పుడు భానుశ్రీ ఎలిమినేట అయ్యింది.మరి భానుశ్రీ ఎలిమినేషన్ కరెక్టే అనుకుంటున్నారా.