ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికి ఉండాలి..తన కూతురిని ఏ విధంగా కాపాడుకున్నాడో తెలిస్తే హ్యాట్సాప్ అంటారు..

782

ఒక కూతురి తండ్రి శిశువు నుండి పెద్దయ్యే వరకు పెద్దయ్యే నుండి టీనేజ్ వరకు ఆమె జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అందువల్ల తండ్రికి అతని చిన్న అమ్మాయి బలంగా, విశ్వాసంతో కూడిన మహిళగా అభివృద్ది చెందడానికి ఒక పెద్ద బాధ్యతను కలిగి ఉంటాడు.కూతురి జీవితంలో తండ్రి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.తను ఎదుగుతున్న ప్రతి క్షణంలో తండ్రి ఆసరా చాలా అవసరం.తండ్రి కూడా కూతురి కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడడు.చివరికి ప్రాణం ఇవ్వడానికి కూడా ఆలోచించడు.ఇప్పుడు అలాంటి ఒక తండ్రి గురించే మీకు చెప్పబోతున్నాను.ఈ విషయం విన్న తర్వాత నాన్న ప్రేమకు ఇంత కంటే గొప్ప తార్కాణం ఏం ఉంటుందనిపిస్తుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

నైరుతి ఢిల్లీలోని ద్వారక సమీపంలో ఉన్న హరి విహార్‌లో సునీల్ అనే వ్యక్తి ఆయన భార్య రచనతో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి వైభవ్ (19), గుల్షాన్ (16), రాధిక (8) అని ముగ్గురు పిల్లలున్నారు. సునీల్ ఓ షూ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.అరకొర ఆదాయం రావడంతో పిల్లలను చదివించడానికే చాలా కష్టపడుతున్నాడు.ఖర్చులు తగ్గుతాయని వారంతా ఒకే గది ఉన్న ఒక ఇంట్లో ఉంటున్నారు.

ఆ ఇల్లు కూడా చాలా పాతది.ఎప్పుడెప్పుడు కూలుతుందా అన్నట్టు ఉంటుంది ఆ ఇల్లు.ఆ కూలే సమయం రానే వచ్చింది. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వారు ఉంటున్న గది పైకప్పు లీకై బలహీనపడింది. కప్పును మోస్తున్న ఉక్కు రాడ్లు తుప్పు పట్టాయి. సోమవారం వేకువ జామున అందరూ నిద్ర మత్తులో ఉండగానే అది ఒక్కసారిగా కూలిపోయింది.కప్పు కూలుతున్న విషయం పసిగట్టిన సునీల్ తన దేహాన్ని రక్షణ కవచంలా మార్చి కుమార్తెను కాపాడాడు. శిథిలాలు మీద పడటంతో అతడు ప్రాణాలు వదిలాడు.

శిథిలాలను తొలగిస్తోన్న రెస్క్యూ సిబ్బంది తండ్రి, అతడి కింద కూతురు ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనలో రాధికకు ఫ్యాక్చర్లయ్యాయి. కానీ తండ్రి చాటున దాక్కొని బతికిపోయింది.ఈ ప్రమాదంలోనే రాధిక తల్లి రచన కూడా మరణించింది. ఊహించని ప్రమాదంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు చనిపోయే సమయంలోనూ మృత్యువుకు తాను అడ్డుపడి తన ప్రాణం కాపాడారని ఆ చిట్టితల్లి బోరున విలపించింది.ఆ చిన్నారులు పడుతున్న మనోవేదన చూసి చుట్టూ పక్కల వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారు.ఆ పిల్లలకు ఇక దేవుడే దిక్కు అని చుట్టూ పక్కల వాళ్ళు చాలా బాధపడుతున్నారు.విన్నారుగా కూతురి ప్రాణం కోసం తన ప్రాణాలు వదిలిన ఈ గొప్ప తండ్రి గురించి.ఇలాంటి తండ్రి దొరకడం ఆ పాప అదృష్టం అనిపిస్తుంది కదా.మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే పిల్లలను ప్రేమగా చూసుకుని వాళ్ళ కోసం జీవితాంతం కష్టపడే ప్రతి తల్లితండ్రుల గురించి వాళ్ళ గొప్పతనం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.