అన్నకి తలకొరివి పెట్టిన చెల్లి…చివరికి ఏమైందో తెలిస్తే షాక్

316

ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన వికాస్‌ఖండ్ జిల్లాలోని చిల్కహర్ పరిధిలోగల పాండ్యేయ్‌పూర్‌లో అన్న చితికి చెల్లెలు నిప్పంటింది. వివరాల్లోకి వెళితే పాండ్యేయ్‌పూర్‌ గ్రామానికి చెందిన సూర్యనాథ్ పాండ్యేయ్‌కు ముగ్గురు సోదరులు. అలాగే అతనికి నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు దిగ్విజయ్ చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంతవరకూ అతని అచూకీ తెలియలేదు.

తరువాతి కాలంలో తల్లిదండ్రులు, మరో కుమారుడు మృతిచెందారు. ఇదిలావుండగా ఇటీవల అనారోగ్యానికి గురైన సోదరుడు ఓం ప్రకాష్ (40) మరణించాడు. బాధలో మునిగిన కుటుంబ సభ్యులకు… మృతుని చితికి ఎవరు నిప్పుపెట్టాలనే ప్రశ్న తలెత్తింది.

దీంతో అతని సోదరి ఆరతి అన్న చితికి నిప్పు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనిని బంధువులు వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆమె వారి మాటలను లెక్కచేయలేదు. అన్నకు ఆమెనే స్వయంగా కర్మకాండలు నిర్వహించింది.