రాక్షసుడు మూవీలో సైకో నిజంగా ఉన్నాడు రష్యాలో 52 మందిని ఏం చేశాడంటే

88

‘రాక్షసుడు’ సినిమాలో హంతకుడు చేసే దారుణ హత్యలు గుండె దడ పుట్టిస్తాయి. బతికుండగానే వెంట్రూకలు, కళ్లు పీకి, ముఖం రూపు రేఖలు మార్చేసి అత్యంత క్రూరంగా హింసించే ఇలాంటి సీరియల్ కిల్లర్లు ఉంటారా అనే అనుమానం కలగక మానదు. వాస్తవానికి ఇంతకంటే దారుణంగా హత్య చేసే కిల్లర్లు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారిలో అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్‌లో రష్యాకు చెందిన ఆండ్రీ చికాటిలో ఒకడు. వాస్తవానికి రాక్షసుడు సినిమాను రష్యాకు చెందిన అలెగ్జాండర్ స్పెసివ్‌త్సేవ్ అనే సీరియల్ కిల్లర్ నేరాల ఆధారంగా తెరకెక్కించారు. అతడు సుమారు 20 మందిని దారుణంగా వేధించి హత్యచేశాడు. అయితే, అతడి కంటే నరరూప రాక్షసుడు ఇంకొకడు ఉన్నాడు. అతడే ఆండ్రీ చికాటిలో. ఇతడిని అంతా బుట్చేర్ అఫ్ రోస్టోవ్, రెడ్ రిప్పర్, రొస్తావ్ రిప్పర్ అనే పేర్లతో పిలుస్తారు. ఈ సీరియల్ కిల్లర్‌ది కూడా రష్యానే కావడం గమనార్హం. ‘రాక్షుసుడు’ సినిమాలో టీచర్ పాత్రకు ఇతడే స్ఫూర్తి. అయితే, సినిమాలో టీచర్‌ను హంతకుడిగా చూపకపోయినా, ఆ పాత్ర తరహాలో ఆండ్రీలో ప్రవర్తన ఉండేది. ఆండ్రీలో కూడా ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు విద్యార్థినీలను లైంగికంగా వేధిస్తూ దొరికిపోవడంతో అతడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు.

స్కూల్ నుంచి సస్పెండైన తర్వాత అవమానంగా భావించిన ఆండ్రీలో ఓ పాత ఇంటిని కొనుగోలుచేశాడు. 1978లో యెలేనా జకోట్నోవా అనే తొమ్మిదేళ్ల బాలికను అపహరించిన ఆండ్రీ, ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే అతడికి అంగస్తంభన సమస్య ఉండటంతో అత్యాచారం సాధ్యం కాలేదు. దీంతో ఆమెను రహస్యంగాన్ని కోశాడు. ఆ తర్వాత ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. ఆమె ఆర్తనాదాలు విని అతడు మరింత రాక్షసుడిగా మారిపోయాడు. అత్యాచారం తర్వాత గ్రుసెవ్కా నదీ తీరంలో పడేసి వెళ్లిపోయాడు. అయితే, అప్పటికే అలక్సాండర్ క్రావ్చెన్కో అనే మరో సీరియల్ కిల్లర్ ఉనికిలో ఉన్నాడు. దీంతో యెలేనాను అతడే హత్యచేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అతడి ఇంటి వద్ద సోదాలు చేశారు. సోదాల్లో మంచు మీద రక్తపు మరకలు కనిపించాయి. అయితే, అలక్సాండర్ ఆచూకీ తెలియలేదు. అతడు ఇంటికి రాలేదని, ఆ రక్తం తనదేనని అలక్సాండర్ భార్య పోలీసులకు తెలిపింది. రక్త పరీక్షల్లో ఆ విషయం ఆమె చెప్పింది నిజమని తేలింది. అయితే, పోలీసుల అనుమానం మాత్రం అలక్సాండర్‌ పైనే ఉంది. దీంతో పోలీసులు అసలు నేరగాడైన ఆండ్రీపై ఎలాంటి అనుమానం కలగలేదు. ఆ తర్వాత కూడా ఆండ్రీ హత్యల పరంపర కొనసాగింది. కేవలం మహిళలనే కాకుండా, స్కూల్ వెళ్లే మగ పిల్లలను కూడా అపహరించి దారుణంగా టార్చర్ చేసి అత్యాచారానికి పాల్పడేవాడు. వారిపై తన వీర్యాన్ని పోసి దట్టమైన అడువుల మధ్యలో వదిలిపెట్టేవాడు. ఈ హత్యల వెనుక కారణం తెలియక పోలీసులు జుట్టు పీక్కొనేవారు. అలా 12 ఏళ్ల పాటు అతడు హత్యలు చేస్తూనే ఉన్నాడు. సుమారు 53 మందిని హత్య చేసి.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగేవాడు.

ఈ హత్యల వెనుక దాగిన సీరియల్ కిల్లర్ ఎవరో తెలియక పోలీసులు డిటెక్టివ్‌లను రంగంలోకి దింపారు. హంతకుడు రైల్వే స్టేషన్, బస్ స్టాప్‌ల నుంచి బాధితులను అపహరిస్తున్నాడనే చిన్న ఆధారంతో అన్ని ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. 1990, నవంబరు 6న ఆండ్రీ 22 ఏళ్ల యువతి స్వెట్లానా కారోస్టిక్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి డాన్లెస్కోజ్ రైల్వే స్టేషన్ వద్ద పడేశాడు. ఆ తర్వాత రైల్వే ప్లాట్‌ఫాం మీదకు చేరుకుని అతడి ముఖం, చేతులు శుభ్రం చేసుకున్నాడు. దీంతో ఆ స్టేషన్‌లో ఉన్న డిటెక్టివ్‌లు అతడిని గమనించారు. ఆండ్రీ దుస్తులకు మట్టి, అతడి గెడ్డానికి, వేళ్లపై గాయాలను చూశారు. వెంటనే అతడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఆ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అడవిలోకి మష్రూమ్‌లు కోసం జనాలు వెళ్తుంటారు. వాటిని తీసుకురావడానికి ప్రత్యేక దుస్తులు, సంచులు తీసుకెళ్తారు. అయితే, ఆండ్రీ సాధారణ దుస్తుల్లో ఉన్నాడు. పైగా గాయాలతో ఉన్నాడు. అయితే, అతడే నేరగాడని చెప్పడానికి డిటెక్టివ్‌ల వద్ద ఆధారాలు లేవు. దీంతో అతడి వద్ద ఉన్న పేపర్లను చెక్ చేసి వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేశాడు.

ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఆ రోజు హత్యకు గురైన స్వెట్లానా కారోస్టిక్ శవం పోలీసులకు లభ్యమైంది. ఆ స్టేషన్ పరిసరాల్లో డిటెక్టివ్‌లు ప్రశ్నించిన వ్యక్తులు, అనుమానితుల పేర్లను పరిశీలించారు. ఆండ్రీపై అనుమానం కలిగి నిఘా పెట్టారు. ఆమె శవం లభించిన మరో ఆరు రోజుల తర్వాత ఆండ్రీ మళ్లీ వేటకు వచ్చాడు. ఆండ్రీ తనతో పెద్ద కప్పు పట్టుకుని వచ్చాడు. స్థానిక పార్కులో బీరు పోయించుకుని తాగాడు. ఆ తర్వాత పార్కులో ఆడుకుంటున్న చిన్నారులతో మచ్చిక చేసుకోడానికి ప్రయత్నించాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మఫ్టీ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆండ్రీకి రక్తపరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కూడా శవాలపై దొరికిన వీర్యంతో అతడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు. దీంతో అతడి బ్లడ్‌ గ్రూప్‌కు వీర్యంలో ఉండే బ్లడ్ గ్రూప్‌కు వ్యత్యాసం ఉండవచ్చనే అనుమానం కలిగింది. ఆండ్రీ నుంచి వీర్యం సేకరించి పరీక్షించారు. రిపోర్టులు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడి వీర్యం ఏబీ గ్రూప్ అని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో నిజాన్ని కక్కించారు. ఏయే నేరం ఏ విధంగా చేశాడో వివరించాడు. ఇలా ఈ రాక్షసుడు దొరికాడు. మరి ఈ నరరూప రాక్షసుడి గురించి అతను చేసిన దారుణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.