ఒక్క ఫేస్ బుక్ పోస్ట్ ఈమె జీవితాన్నే మార్చింది..ప్రతి ఒక్క మహిళకు ఇన్స్పిరేషన్ ఈమె జీవితం..!

415

మనం ఎన్నో మనస్సును కదిలించే కథనాలు చదివి ఉంటాం. వారి బాధలు, గాథలు చూసి మనం కూడా కన్నీరు కారుస్తుంటాం. కొందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రతిభనే శ్వాసగా బతికి విజయం సాధించిన వారూ ఉంటారు. అలాంటి వారు అందరికీ ఆదర్శం. అలాంటి ఒక వ్యక్తి జీవితం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.సోషల్ మీడియా వలన తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపిస్తున్నారు.అలా చూపించి ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆ వ్యక్తి కథే ఈ స్టొరీ.మరి ఆ వ్యక్తి గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఆమె పేరు గంగమ్మ.గంగమ్మది కర్ణాటకలో ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి పేరు కొప్పల్. ఆమెది ఒక సన్నకారు రైతు కుటుంబం. తల్లిదండ్రులు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. అందుకే ఆమె ఐదో తరగతి దాకే చదివింది.ఆమె బాల్యం అంతా కష్టాల కడలిలో సాగింది. అందుకే ఆమె చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ చిన్నతనం నుంచే గంగమ్మకు పాటలంటే ప్రాణం. పాటే శ్వాసగా ధ్యాసగా బతికింది గంగమ్మ. కన్నడతో పాటు హిందీ, తెలుగు పాటలు ఆమె కమ్మని గొంతుతో పాడుతుంటే మైమరిచిపోయి వింటాం.హిందీ, తెలుగు పాటలు మొత్తం కూడా కన్నడ భాషలో రాసుకుంటూ పాడుతూ ఉంటుంది గంగమ్మ.గంగమ్మ నాన్న చనిపోయిన సమయంలో గంగమ్మ కుటుంబ చాలా కష్టాలు ఎదుర్కొంది. కానీ గంగమ్మ పాటనే ఆ కుంటుబానికి అండ అయ్యింది. పూట గడవడానికి ఆమె పాటే ఆధారమైంది. చిన్నతనం నుంచే గంగమ్మకు పాటలపై ఇష్టం పెంచుకుంది.

కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఆమె తల్లి మనకెందు ఆ పాటలుగీటలు అంటూ మందలించింది.పాటలు అనుకుంటూ తన కూతురు బెంగుళూరులాంటి నగరాలకు వెళ్తే అక్కడ తనకు ఏమవుతుందోనని గంగమ్మ తల్లి భయం.ఆ ప్రేమతోనే కూతురికి ఇష్టమైన అభిరుచిని వదులుకోమంది. కానీ గంగమ్మ మాత్రం తల్లికి తెలియకుండానే ఆర్కెస్ట్రాలలో పాడేది. దీంతో ఆమె గొంతు బయటి ప్రపంచానికి తెలిసింది. గంగమ్మ పాట విన్న వాళ్లంతా మళ్లీ మళ్లీ ఆ పాట వినాలని ఆశించేవారు. గంగమ్మ కూలీ పనులు చేస్తూనే మరోవైపు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా పాటలు పాడేది. ఈ క్రమంలో ఆమెకు శివప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా గంగమ్మ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.శివప్రసాద్ గంగమ్మ పాట వినగానే ఈమె ఇక్కడ ఉండాల్సింది కాదు అనుకున్నాడు. ఒకసారి గంగమ్మతో పాట పాడించి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. అంతే క్షణాల్లో లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 6 గంటల్లో 5 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేలాది మంది కామెంట్స్ చేశారు. వందలాది మంది షేర్ చేశారు. శివప్రసాద్ ఆమెతో ఫేస్ బుక్ లో లైవ్ లో పాడించడం మొదలుపెట్టించాడు. దీంతో ఆమె క్రేజీ మరింత పెరిగింది.

ఇప్పుడు గంగమ్మక కర్ణాటకలో జూనియర్ ఎస్. జానకి గా పేరుగాంచింది. జూనియర్ జానకి అంటే గుర్తు పట్టని వారు ఎవరూ ఉండరు. అంతగా పాప్ లర్ అయిపోయింది. గాయని జానకి గురించి మనకు తెలిసిందే. దక్షిణ భారతదేశంలోనే ఆమె ఫేమస్ సింగర్. అంతేకాదు జానకి 17 భాషలలో 48,000 పాటలను పాడి రికార్డ్ క్రియేట్ చేశారు. జపనీస్, జర్మనీ వంటి భాషల్లోనూ జానకి పాడారు. 1957 నుంచి ఇప్పటికీ జానకి పాడుతున్నారు.అంత పాపులారిటీ ఉన్న జానకి గంగమ్మను ఏమందో తెలుసా.. ఒకసారి జానకి గంగమ్మ పాట విన్నారు. ” జానకిని నేను కాదమ్మా.. నిజమైన జానకివి నువ్వేనమ్మా” అని ఆ జానకి ఈ జూనియర్ జానకికి కితాబిచ్చారు. జానకి అంటే గంగమ్మకు కూడా చిన్నప్పటి నుంచి ప్రేరణ. ఎప్పటికైనా ఆమె అంతకాకున్నా తను కూడా జానకిలా పేరు తెచ్చుకోవాలని కలలు కనేది గంగమ్మ. ఆ కల నిజం చేసుకుంది.

ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గంగమ్మకు పాడేందుకు ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గంగమ్మ పాడిన పాటల వీడియోలు వైరల్ అయినప్పటి నుంచి ఆమె పేరు మారిమోగిపోతుంది. ఎన్నో అవార్డులు రివార్డులు గంగమ్మకు దక్కాయి.గంగమ్మ 20 ఏళ్లుగా తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కానీ ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసిన 15 రోజుల్లోనే ఆమె లైఫ్ మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ. కొప్పల్ నుంచి ఇప్పుడు ఆమె బెంగుళూరు వచ్చింది. రోజూ పాటలు పాడడంతో పాటు బిజీ షెడ్యూల్ తో ఆమె బిజీబిజీగా ఉంటుంది. ప్రతిభ ఉండి గంగమ్మలా ఇబ్బందులుపడేవారు చాలా మందే ఉంటారు.కానీ ఆ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తే మీ వెంటే ప్రపంచం పడుతుంది.