‘ అమర్ అక్బర్ ఆంటొని’ రివ్యూ & రేటింగ్ .. రవితేజ ఫాన్స్ కు పునాకలే

627

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వ వైభవం సంపాదించాలని శ్రీనువైట్ల కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి చిత్రం ఎలా ఉందొ చూద్దామా.

సినిమా చూసినవాళ్లందరికి శ్రీనువైట్ల పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుందిఅందరు. శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్టాఫ్లో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఇక రవితేజ కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. ఇలియానా అందం, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది.. అయితే క్లాస్ ఆడియన్స్ కు మాత్రం ఫస్టాఫ్ యావరేజ్గా అనిపిస్తుంది.. సెకండాఫ్లో వచ్చే కామెడీ క్లాస్ ఆడియన్స్ కు నచ్చుతుంది.. రొటీన్ స్క్రీన్ప్లేతో శ్రీనువైట్ల ఆకట్టుకోలేకపోయారని కూడా అనిపిస్తుంది.సునీల్ కామెడి పర్లేదు అని అనిపిస్తుంది.. కానీ అందరు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.. రవితేజ ఇరగదీశాడు , థియేటర్లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

మొత్తంగా చూసుకుంటే సినిమా హిట్ అనే చెప్పుకోవాలి. రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో అమర్ గా, అక్బర్ గా, ఆంటోనీగా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ అదరగొట్టారు.ముఖ్యంగా అక్బర్ అనే ముస్లిం యువకుడి పాత్రలో అదుర్స్ అనిపించారు. ఒక కేరెక్టర్ కి, మరొక కేరెక్టర్ కి సంబంధం లేకుండా వేర్వేరు నటులు మూడు కేరెక్టర్స్ చేసారేమో అనేంతగా వైవిధ్యం చూపించారు. ఇక విలన్ గా విక్రమ్ జీత్ విర్క్ బాగా నటించారు. బాద్ షా మూవీలో సైడ్ విలన్ గా నటించిన ఈయన ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించారు. గబ్బర్ సింగ్ లో విలన్ గా నటించిన అభిమన్యు సింగ్, షయాజీ షిండే, తనికెళ్ళభరణి, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, లయ తదితరులు తమ పాత్రలకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్…
రవితేజ నటన, ఇలియానా అందాలు, కామెడీ, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..డైరెక్షన్..
మైనస్ పాయింట్స్…
రొటీన్ స్క్రీన్ ప్లే, పాత కథ, సాంగ్స్