హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరో హీరోయిన్..షాక్ లో సినీ ఇండస్ట్రీ

877

ఈ కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణం అయ్యింది.పెళ్ళికి ముందు కలిసుండటం నచ్చితే పెళ్లి చేసుకోవడం లేకపోతే విడిపోవడం. ఇది ఈ కాలంలో యువత జరుపుతున్న తతంగం. అయితే ఈ తతంగం సినిమా రంగంలో ఉన్నవారు ఎక్కువగా జరుపుతారు.సినిమా నటులు ప్రేమించుకోవడం డేటింగ్ చెయ్యడం అనేవి కామన్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న దీపికా రణవీర్ లు కూడా ముందు డేటింగ్ చేసుకునే తర్వాత పెళ్లి చేసుకున్నారు.అయితే డేటింగ్ లో ఉన్న కొందరు నటినటులు చేసే పనులు అప్పుడప్పుడు చర్చనీయాంశం అవుతుంది.ఇప్పుడు డేటింగ్ లో ఉన్న ఇద్దరు నటీనటులు చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది.మరి జంట ఎవరు ఏం చేశారో తెలుసుకుందామా.

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ డేటింగులో ఉన్నట్లు కొన్ని రోజలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి వారి కుటుంబ సభ్యుల సమ్మతి కూడా లభించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా ముంబైలోని ఓ ఫైస్టార్ హోటల్‌లో స్టే చేయడం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేయడానికి, ఏకాంతంగా గడపటానికే ఇలా రూమ్ బుక్ చేసినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి.సాధారణంగా షూటింగ్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ హోటల్స్‌లో స్టే చేయడం సర్వసాధారణం. అయితే ముంబైలో హోటల్‌ రూమ్ తీసుకుని ఉండటంతో అందరిలోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న ఈ జంట ఈ సినిమా ద్వారా మరింత దగ్గరయ్యారని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్, రొమాన్స్ మొదలైనట్లు తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం రణబీర్‌ను కలిసేందుకు అలియా భట్ న్యూయార్క్ వెళ్లింది. రణబీర్ తండ్రి రిషి కపూర్‌కు సర్జరీ జరుగడంతో అలియా వెళ్లి పరామర్శించి వచ్చారు. రణబీర్, అలియా భట్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ చాట్లో సైతం కొందరు అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించగా…. త్వరలోనే పెళ్లి చేసుకుంటా అంటూ రణబీర్ సమాధానం ఇచ్చారు. మరి అలియానే పెళ్లి చేసుకుంటాడా లేక వేరే వారిని చేసుకుంటాడో చూడాలి.