తాను చనిపోతాను అని హరికృష్ణకు ముందే తెలుసా.?షాకింగ్ నిజాలు చెప్పిన హోటల్‌కు యజమాని రమణయ్యా

676

నందమూరి హరికృష్ణ మరణంతో అటు సినీ లోకం ఇటు రాజకీయ రంగంలో విశాదచాయలు అలుముకున్నాయి.ముఖ్యంగా నందమూరి వంశంలో ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి.ముఖ్యంగా ఆయన కొడుకులు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు.చాలా మంది ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.అయితే అబిడ్స్ లోని ఆహ్వానం హోటల్ రూమ్ బాయ్ కూడా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.మరి ఆ రూమ్ బాయ్ చెప్పిన విషయాల గురించి తెలుసుకుందామా.

హరికృష్ణ ఎలా ఉండేవారు ఏమేమి తినేవారు అన్న విషయాల గురించి ఆ హోటల్ రూమ్ బాయ్ కొన్ని విషయాలు చెప్పాడు..ఆయన ఏం చెప్పాడంటే..హరికృష్ణకు ఆబిడ్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి ఎన్టీఆర్‌ ఎస్టేట్‌లో 1964 డిసెంబర్‌ 14న ప్రారంభించిన ఆహ్వానం హోటల్‌లో ఆయన ఎక్కువ సమయం ఉండేవారు. రాజకీయ నిర్ణయాలు, స్నేహితులతో సమావేశాలు, వ్యాపార, సినిమా విషయాలను ఇక్కడే చర్చించేవారు.హోటల్‌లోని 1001 గదిలోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేవారట. ఆయన దినచర్య కూడా ఈ గది నుంచే ప్రారంభమయ్యేది. ఉదయం 6 గంటల వరకు హోటల్‌లోని ఈ గది వద్దకు చేరుకునే వారు. ముందుగా ఈ గదికి ఎదురుగా ఉండే వినాయకుడి విగ్రహానికి పూజలు చేసి లోనికి వెళ్లేవారు.అనంతరం దినపత్రికలు చదివి కొంత సేపు సేదతీరేవారు.17 ఏళ్ల నుంచి హరికృష్ణసార్‌కు ఈ హోటల్‌లో సేవలందిస్తున్నాను. కాఫీలో ఎంత చక్కెర ఉండాలి.. టిఫిన్‌ ఏంటి.. మధ్యాహ్నం భోజనంలో ఏమేం ఉండాలి.. ఏ మందులు ఇవ్వాలి.. అన్నీ నేనే చూసుకునే వాడ్ని. మంగళవారం సాయంత్రం కూడా మందులు తేవాలని సార్‌ సూచించడంతో డాక్టర్‌ రాసిచ్చిన స్లిప్‌ను తీసుకెళ్లి మందులు తెచ్చాను. హోటల్‌కు వస్తే రమణయ్యా అని తొలుత నన్నే పిలిచేవారు. సార్‌ వచ్చిన వెంటనే కారులో ఉన్న వాటర్‌ బాటిళ్లు, మందులను తీసుకుని గది శుభ్రం చేసి లోపల పెట్టేవాడ్ని.

కామత్‌ హోటల్‌ నుంచి తెచ్చిన టీ తాగిన తర్వాత టీ టైమ్‌ హోటల్‌ నుంచి ఇడ్లీ తెప్పించుకునేవారు. 10 తర్వాత బయటకు వెళ్లి తిరిగి 12 గంటలకు వచ్చేవారు. భోజనం చేసిన తర్వాత బీపీ, షుగర్‌కు సంబంధించిన మందులు వేసుకునేవారు. కొద్దిసేపు టీవీ చూసి సేదతీరేవారు.రోజూ ఇంటికి వెళ్లేముందు అర లీటరు జెర్సీ పాలు తీసుకెళ్లేవారు. మంగళవారం నిర్వహించే పూజా కార్యక్రమాల కోసం ప్రతీ సోమవారం సాయంత్రం నిమ్మకాయలు, నాలుగు కొబ్బరికాయలు, పూజా సామగ్రిని నాతో తెప్పించుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. ముఖ్యంగా సార్‌ ఏదైనా ఒత్తిడిలో ఉంటే ఆబిడ్స్‌లోని కేఎఫ్‌సీ నుంచి చికెన్‌ లాలీపాప్‌లు, పాపాజి దాబా నుంచి తందూరి చికెన్‌ తెప్పించుకునేవారు. రాత్రి ఇంటికి వెళ్లే ముందు రమణయ్యా నేను వెళ్తున్నా.. జాగ్రత్త అని ఆప్యాయంగా చెప్పి వెళ్లేవారు. ఆయన మరణించారంటే నమ్మలేకపోతున్నా. అంతటి గొప్ప వ్యక్తి లేకపోవడం నా దురదృష్టకరం అని హోటల్ బాయ్ రమణయ్య కన్నీతిపర్యంతం అవుతూ చెప్పాడు.