షూటింగ్ లో భారీ ప్రమాదం నుండి బయటపడ్డ రామ్ చరణ్.షాక్ ఫ్యామిలీ

430

రంగస్థలం చిత్రం ఫీవర్ ఇంకా అభిమానులని వీడడం లేదు. మగధీర తరువాత రాంచరణ్ కు నిఖార్సైన చిత్రం పడడంతో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సంబరాల వెనుక రంగస్థలం చిత్ర యూనిట్ ఏడాది సమయం కష్టం ఉంది. అదమైన కథని రూపొందించుకున్న సుకుమార్ కష్టపడి వెండి తెరపై రంగస్థలం అనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు.అయితే రంగస్థలం ఇచ్చిన ఊపులోనే వెంటనే బోయపాటి సినిమాను పట్టాలెక్కించాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడంట.మరి ఏం జరిగిందో తెలుసుకుందామా.

రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.ఒకవైపు తండ్రి సైరా సినిమా నిర్మాతగా మరొకవైపు బోయపాటి డైరెక్షన్ లో తాను చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు.అయితే ఇలాంటి సమయంలో మెగా అభిమానులకు ఒక చేదు వార్త చెప్పబోతున్నాను.అదేమిటి అంటే రామ్ చరణ్ ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాడు.అసలేమైందంటే..రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే..అయితే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం అగర్ జైజాన్ లో జరుగుతుంది.ఒక భారీ యాక్షన్ సీన్ జరుగుతుంది.అయితే ఈ ఫైట్ సీన్స్ ఒక తేనే తీగలు ఉండే ఒక భారీ ఫార్మ్ హౌస్ దగ్గర జరుగుతున్నాయంట.ఒకవేళ ఆ తేనే తీగలను ఏమైనా చేస్తే అవి చిత్ర యూనిట్ మీద దాడి చేసే ప్రమాదం ఉంది.కాకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకుని అక్కడ షూటింగ్ ఏర్పాటు చేశారని సమాచారం.

అయినా కూడా ఆ తేనే తీగలకు ఏదో ఆటంకం కలిగి షూటింగ్ జరుగుతున్న సమయంలో అవి చిత్ర యూనిట్ మీదకు వచ్చాయంట.అయితే చిత్ర యూనిట్ వెంటనే స్పందించడం వలన ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఎవరికీ గాయాలు కూడా కాలేదు.అయితే ఈ విషయం గురించి రెండు రోజుల ముందే ఉపాసన ఒక ట్వీట్ చేసింది.ఇక్కడ తేనే తీగలు చాలా ఉన్నాయి.ఐన సాహసించి షూటింగ్ చేస్తున్నారు.మీకెలాంటి ఆపద కలగకూడదని ట్వీట్ చేసింది.అలా చేసిన మరుసటి రోజే తేనే తీగలు దాడికి దిగడం గమనార్హం.అయితే చిత్ర యూనిట్ వెంటనే తేరుకుంది కాబట్టి ప్రమాదం తప్పింది.లేకుంటే ఎవరికైనా గాయాలు అయ్యే అవకాశం ఉండేది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.