Breaking News:రజినీకాంత్ ఆరోగ్యం విషమం.. చెన్నైలో ఉద్రిగ్ద పరిస్థితులు

518

సూపర్ స్టార్ రజినీకాంత్… పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండియాకు ఆయన సూపర్ స్టార్.60 ఏళ్ళు పై బడినా ఇంకా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.అయితే ఆయన ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగాలేదు.అయినా అమెరికాలో చికిత్స చేపించుకుని మళ్ళి సినిమాలతో బిజీగా ఉన్నారు.అప్పుడప్పుడు ఆరోగ్యం కోసమని అమెరికా వెళ్లాడని పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి.అయితే ఇప్పుడు మళ్ళి అలాంటి కొన్ని వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.మరి ఆయన ఆరోగ్యానికి ఏమైంది.నిజంగానే సీరియస్ గా ఉందా…ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది అంటూ గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. 2.ఓ చిత్రం విడుదల సమయంలో రజినీకాంత్ అనారోగ్యం బారిన పడటం విచారకరం అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. రజినీ ఆరోగ్యం బాగుండాలని పూజలు కూడా చేశారు. అయితే రజినీకాంత్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు పుకార్లే అని తేలిపోయింది.దీనిపై రజనీకాంత్‌ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశాయి. వదంతులను నమ్మవద్దని కోరాయి.

తాజాగా తన భార్య లత రజినీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంగా – ఎనర్జిటిక్ గా ఉన్నట్లుగా కనిపించాడు. ఎలాంటి సమస్య లేని రజినీకాంత్ హాస్పిటల్ లో ఉన్నాడంటూ ప్రచారం చేసి ఫ్యాన్స్ ను ఆవేదనకు గురి చేయడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి చెత్త వార్తు ఇకపై ఆపండి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహంతో మీడియాను హెచ్చరిస్తున్నారు.రజినీ 2.ఓ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ కూడా తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, రజనీ నటించిన తాజా చిత్రం ‘పేట’ ఆడియోను డిసెంబరు 9న విడుదల చేయనుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, సిమ్రన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సినిమాను నిర్మిస్తోంది.