బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణ, కోస్తాలో నేడు భారీ వర్షాలు

151

ఏపీ, తెలంగాణ రాష్ట్రలలో కొన్ని ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉందని పేర్కొంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇంకా సరైన వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జులైలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా చెరువులు, జలాశయాలు నిండంటం లేదు. దీని కారణంగా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం తెలంగాణలో 102 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది.

Image result for rain

బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇది పశ్చిమ్ బెంగాల్‌ ఉత్తర భాగం, దాని పరిసర ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తువరకు ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభాబంతో కోస్తాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం అత్యధికంగా ఉర్లుగొండలో 7.9 సెంటీమీటర్లు, మధిరలో 7 సెం.మీ, అర్వపల్లిలో 6.8 సెం.మీ, నాగారంలో 6.7 సెం.మీ, నడిగూడెంలో 6.3, ఖానాపూర్‌లో 6.2 ప్రకాశ్‌నగర్‌లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ క్రింద వీడియోని చూడండి

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన ముందస్తు అంచనాలు తలకిందులయ్యాయి. మరోవైపు, ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజస్థాన్‌లో వర్షాలకు జనజీవనం స్తంభించింది. మొత్తం రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, కొన్ని జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. అటు, అసోంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మొత్తం 30 లక్షల మంది వరద ప్రభావానికి గురికాగా, 70 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగాలు, జింకల సహా 200 వరకు వన్యప్రాణులు మృత్యువాతపడ్డాయి.

Image result for rain

ఇటు ముంబయిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోస్తా ఆంధ్ర, తెలంగాణ, యానాం, ఝార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్‌గఢ్, గుజరాత్, కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మరి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.