అన్నా నా అంత్యక్రియలు జరిపించవా..అంటూ పవన్ రాసిన లేఖ చూసి, క‌న్నీరుపెట్టుకున్న ప‌వ‌ర్ స్టార్

470

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అభిమానులు ఆయ‌న్ని చూస్తేనే మా దేవుడి అని సంతృప్తి చెందుతారు.. ఇక సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్, జ‌న‌సేన పార్టీతో యువ‌త‌లో మ‌రింత హైప్ తీసుకువస్తున్నారు.. అలాంటి ప‌వ‌న్ పై అభిమానం కూడా అలాగే పెంచుకున్నారు అభిమానులు. వారి అభిమానం క‌ట్ట‌లు తెచ్చుకుంటోంది. ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా వేల సంఖ్య‌లో అభిమానులు వ‌స్తున్నారు. ప‌వ‌న్ ఎక్క‌డ బ‌హిరంగ స‌భ‌పెట్టినా పెద్ద సంఖ్య‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.. ఈ విష‌యంలో ప‌వ‌న్ కూడా ఎంతో ఆవేద‌న ప‌డ్డారు.. దీనికి కార‌ణం తెలియ‌క‌పోయినా, ఆయ‌న అభిమాని మ‌ర‌ణించి ఓ సూసైడ్ లెట‌ర్ రాశాడు.. తాను చ‌నిపోవ‌డానికి ముందు ఆ సూసైడ్ లెట‌ర్ రాశాడు…విజ‌య‌వాడ‌లో త‌ల్వాక‌ర్ జిమ్ లో అనిల్ ప‌నిచేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియ‌దు కాని ఈ రోజు ఉద‌యం ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు, ఈ ఆత్మ‌హ‌త్య‌తో పోలీసులు అత‌ని ఇంటికి వ‌చ్చి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మ‌యంలో అక్క‌డ ఓ సూసైడ్ నోట్ దొరికింది.

తాను చ‌నిపోవ‌డానికి ముందు అనిల్ ఈ సూసైడ్ లెట‌ర్ రాశాడు అని అంటున్నారు. తన‌కు ప‌వ‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ ని క‌ల‌వాలి అని చాలా ట్రై చేశాను కాని కుద‌ర‌లేదు అని లేఖ‌లో పేర్కొన్నాడు అనిల్.. తాను చ‌నిపోయిన త‌ర్వాత అయినా ప‌వ‌న్ న‌న్నుచూడాలి అని, ఆయ‌న చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జ‌ర‌గాలి అని కోరుకున్నాడు అనిల్. నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నలాంటి వ్య‌క్తి, త‌ను నాకు బంధువులాంటి వ్య‌క్తి అని పేర్కొన్నాడు లేఖ‌లో.అనిల్ ఇంట్లో త‌న భార్య‌తో గొడ‌వ‌ల వ‌ల్ల ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా, లేదా మ‌రేదైనా కార‌ణం ఉందా అని కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఇక మొన్న జ‌రిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో కూడా పాల్గొన్నాడు అని, ఇంత‌లో ఎంత క‌ష్టం వ‌చ్చిందో అని ఆ కుటుంబం అత‌ని స్నేహితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.. ఈ విష‌యం ప‌వ‌న్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ ద్వారా ఇప్ప‌టికే ప‌వ‌న్ కు తెలియ‌చేశారు అని అంటున్నారు