43 మంది జవాన్లు చనిపోతే పాకిస్తాన్ లో సానియా మీర్జా ఏం చేసిందో చూస్తే ఛీ కొడతారు

377

పాకిస్తానీ కోడలు సానియా మీర్జాపై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామాలో ఉగ్రదాడిలో పెద్దసంఖ్యలో భారత జవాన్లు మరణించి దేశమంతా విషాదంలో ఉండగా సానియా మీర్జా మాత్రం ఆ సోయి లేకుండా సోషల్ మీడియాలో హొయలుపోతూ తన కొత్త డ్రెస్ ఫొటోలు షేర్ చేసింది. ‘సరికొత్త డ్రెస్ వేసుకున్నాను చూడండి – డిజైన్ చేసింది వారు – మేకప్ చేసింది వీరు…’ అంటూ ఓ పర్సనల్ పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ లింకును ట్విటర్ లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. దేశం మొత్తం ఉగ్రదాడికి బాధపడుతుంటే నువ్వు మాత్రం ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేస్తావా? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు నీ ఫొటోలు చూసేంత ఆసక్తి లేదు… కనీసం దాడి పట్ల చిన్న స్పందన కూడా లేకుండా ఇలా ఫొటోలు పెడతావా? అంటూ నిప్పులు కక్కారు. నీ కొత్త డ్రెస్ చూపించడానికి ఇదా సమయం… నువ్వసలు భారతీయురాలివేనా? అంటూ నిలదీశారు.

Image result for sania mirza

‘భారతదేశం కన్నీరు పెడుతుంటే నువ్వూ నీ ఫొటో షూట్ లు’ అంటూ విరుచుకుపడ్డారు. సానియా ఇలాంటి దాడి జరిగితే స్పందించదు – ఎందుకంటే ఆమె పాకిస్థాన్ మహిళ… అంటూ మరో నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అయితే సానియా కొద్దిసేపటికే తన తప్పు తెలుసుకుని పుల్వామా దాడిపై తన స్పందన తెలియజేసింది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలోనే స్థానం లేదంటూ సీరియస్ గా ఓ ట్వీట్ చేసింది. అంతేకాదు మృతవీరుల కుటుంబాలకు తన సంతాపం ప్రకటించింది. దీంతో నెటిజన్లు శాంతించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా… జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో తీవ్రవాద దాడి కారణంగా 42మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దాదాపుగా సెలబ్రిటీలంతా స్పందించారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ అయితే ఉగ్రవాదుల భరతం పట్టాలంటూ ఆవేశంగా స్పందించారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ.. సానియా మాత్రం ఇదేమీ పట్టకుండా తన సరదాల్లో మునిగిపోయారు. అయితే… సానియాపై ఇండియన్ నెటిజన్లు చేసిన ఈ దాడికి ఆమె పాకిస్తానీ ఫ్యాన్స్ కౌంటర్లేశారు. ఆమె తమ దేశపు కోడలు కాబట్టి స్పందించలేదంటూ వెనకేసుకొచ్చారు. సానియా గతంలో జాతీయ పతాకాన్ని అవమానించి కూడా వివాదంలో చిక్కుకున్నారు. మరోవైపు సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా కూడా భారీ నజరానాలు అందుకున్నారు. అన్నీ ఈ దేశం నుంచి పొందిన ఆమె స్పందన ఇంత దారుణంగా ఉండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.