బావతో అక్క సంసారం చేస్తూనే ప్రియుడితో ఆ పనిచేస్తోంది అది చూసి చెల్లి చివ‌ర‌కు ఏం చేసిందంటే.?

835

మేము హైదరాబాద్‌లో ఉంటున్నాం. మా అక్కకు రెండేళ్ళ క్రితం పెళ్లిచేశాం. ఆమెకు ఓ పాప కూడా ఉంది. నిజానికి ఆమె పెళ్లికి ముందే ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఒప్పించి మరో వ్యక్తితో పెళ్లి చేశాం. ఇక పెళ్లికి ముందు ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం కాబ‌ట్టి ఇక ఆమె కూడా ఈ విష‌యం ప‌క్క‌న పెట్టింది అని అనుకున్నాం భ‌ర్త‌తో బాగుంటుంది అని అనుకున్నాం కాని ప‌రిస్దితి ఇప్పుడు ఇలా లేదు. ఆమె అయినా మార‌లేదు.

కానీ, పెళ్లయ్యాక కాకపోయినా పాప పుట్టిన తర్వాత అయినా మారుతుందని ఎదురు చూశాం మా ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పులేదు. ఒకవైపు బావతో పలుకుతూనే మరోవైపు ప్రియుడితోనూ దొంగచాటుగా కలుస్తోంది. ఈ విషయం బావకు తెలిసి.. మందలించాడు కూడా అయినా మార్పురాలేదు.. ఏం చేయాలో తెలియడం లేదు. ఆమె కాపురం ఎపుడు కూలిపోతుందోనన్న భయం వెంటాడుతోంది.

ఇక్కడ తప్పు చేస్తున్నది మీ అక్క కాదు. మీరు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోకుండా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక అయినా ఆమె అత్తారింట్లో సరిగ్గా ఉందో లేదో తెలుసుకోలేదు. పైపెచ్చు… భర్తతో ఏమైన సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ఇక్కడ కావాలిసింది కోపం, దండన కాదు. కన్నవారికోసం ఒకసారి ప్రేమను వదులుకున్న ఆమె.. ఇపుడు పుట్టిన బిడ్డ కోసం సర్దుకోమని చెబితే ఖచ్చితంగా తనను మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా, కాస్త ఓర్పుతో ఆమెతో మాట్లాడటమే. ఇదే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె మారేలా కౌన్సిలింగ్ ఇవ్వ‌డం ఆమె ప్రియుడి నుంచి ఏమీ కోరుకుంటుందో అవి మీ బావ ఆమెకు ఇచ్చేలా చూడండి. అప్పుడు ఆమె క‌చ్చితంగా మారుతుంది. మీకుటుంబంలో మాములు ప‌రిస్దితి వ‌స్తుంది. కాదు అంటే మీకు మ‌రింత చిచ్చు వ‌స్తుంది.