86 సెకండ్లలో పాక్ కు ఉచ్చ పోయించిన అభినందన్ ఏం చేసాడో తెలిసి దేశం మొత్తం గర్విస్తోంది

490

గత 15 రోజులుగా ఇండియా పాక్ ల మధ్య బీకరపోరు జరుగుతుంది. పాక్ ఉగ్రవాదులు చేసిన మరణాఖండాకు కు భారత్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. పుల్వామాలో పాక్ 49 మంది భారత సైనికులను చంపేసింది.ఆ తరువాత పాక్ దాడికి ప్రతీకారంగా భారత్ ప్రతీకారదాడి చేసి 300 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను హతం చేసింది. ఈ దెబ్బతో పాక్ కు వణుకుపుట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచినట్టుగా సమాచారం. ఆ తరువాత పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. రెండు రోజులు బందీగా ఉంచుకుని ఈరోజు అభినందన్ ను విడుదల చేస్తుంది పాక్. అయితే పాక్ యుద్ద విమానం వెంట అభినందన్ పడ్డప్పుడు అసలేం జరిగింది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి కొట్టడంలో, నేల కూల్చడంలో మనదేశ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ విషయం భారత వైమానిక దళానికి చెందిన రాడార్ ద్వారా వెల్లడైంది. ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే.. నౌషేరా సెక్టార్ పరిధిలోని లామ్ లోయ సమీపంలో భారత సైనిక శిబిరాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించింది. అవి గతి తప్పాయి. లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి.దీన్ని గమనించిన వెంటనే నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ సందర్భంగా అభినందన్.. ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా.. అని మిగ్ 21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు.

ఎఫ్-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్ లో రికార్డయ్యింది. నాలుగు సెకెన్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. దీన్ని గంటలతో లెక్కిస్తే 900 కిలోమీటర్ల దూరం అవుతుంది. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో మిగ్-21 ప్రయాణించింది. అంతే వేగంతో 86 సెకెన్ల పాటు మిగ్ ప్రయాణించింది. నియంత్రణ రేఖ దాటి, పాక్ గగనతలంలోకి ప్రవేశించిన క్షణాల వ్యవధిలోనే ఇంజిన్ స్తంభించింది. దీనితో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన్ దిగినట్లు వెల్లడైంది. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ 21 ద్వారా ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. అది నేరుగా ఎఫ్ 16ను ఛేదించింది. అదే సమయంలో మరో రెండు గస్తీ విమానాలైన సుఖోయ్, మిరేజ్ 2000 మిగిలిన రెండు పాక్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదుర్కొన్నాయని వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. ఇదండీ పాక్ యుద్ధ విమానాల వెంటపడ్డప్పుడు అభినందన్ చేసిన పోరాటపటిమ. మరి అభినందన్ గురించి అలాగే పాక్ యుద్ధ విమానాల వెంటపడ్డప్పుడు అభినందన్ చూపించిన తెగువ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.