చలి పుడుతుందని ప్లాస్టిక్ కవర్ కప్పుకుని పడుకుంది.. తెల్లారికి జరిగింది తెలిస్తే షాక్

1290

మన దేశంలో చాలా మందికి విదేశాలకు వెళ్ళాలని అక్కడ చదువుకోవాలని అక్కడ ఉద్యోగం చేసి సంపాదించాలని….ఇలా విదేశీ కోరికలు చాలా ఉంటాయి.అయితే ఇలా కలలు కని అక్కడికి వెళ్లి కష్టాలు పడ్డవారు చాలా మంది ఉన్నారు.ఎందుకంటే అక్కడ సంపాదించకుంటే చాలా కష్టం.చదువుకునే వారు కూడా అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబు చెయ్యాల్సిందే.ఇక్కడ మనం అనుకునేది ఒకటి అక్కడికి వెళ్ళాకా జరిగేది ఒకటి.అయితే ఇలా విదేశీ ,మోజుతో వెళ్ళిన ఒక అమ్మాయికి జరిగిన సంఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఆమెకు జరిగిన సంఘటన విని అయినా ఒక్కసారి ఆలోచిస్తారని మీకు ఈ విషయం చెప్పబోతున్నాను.వినండి..

Related image

మన దేశంలో యువతకు విదేశీ మోజు ఎలా ఉంటుందో పిలిప్పిన్స్ దేశంలో యువతకు కూడా ఇలాంటి మోజే ఉంటుంది.వేరే దేశం వెళ్లి లక్షలకు లక్షలు సంపాదించాలి అనుకుంటారు.ఎందుకంటే పిలిప్పిన్స్ లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు.కనీసం రెండు పూటలు భోజనం చెయ్యడానికి కూడా వీళ్ళకు ఉండదు.అంత కఠిన బీద పరిస్థితిని అనుభవిస్తుంటారు. అందుకే విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి తమ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అనుకుంటారు.

అందుకోసం ఎలాంటి కష్టానైన్న అనుభవించడానికి సిద్దపడతారు.చిన్న చితకా పనులకు కూడా విదేశాలకు వెళ్లాలని అనుకుంటారు.అలా ఒక అమ్మాయి విదేశాలకు వెళ్లి ofw సంస్థలో చేరిందంట.అయితే ఆ అమ్మాయికి ఎదురైనా సమస్యలు అన్ని ఇన్ని కావు.కనీసం పాడుకోడానికి ఆ అమ్మాయికి ఒక బెడ్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారేమో ఆ కంపెనీ వాళ్ళు.కప్పుకోడానికి ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు.

దాంతో ఆ అమ్మాయి కటిక నేల మీద పడుకుంది.చలికి తట్టుకోలేక ఒక ప్లాస్టిక్ కవర్ ను కప్పుకుంది.అయితే ఇలా పడుకున్న ఈ అమ్మాయిని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఆ ఫోటో వైరల్ అయ్యింది.వెంటనే అక్కడి ప్రభుత్వం ఆ కంపెనీ మీద చర్యలు తీసుకుంది.అంతేకాకుండా ఆ అమ్మాయికి సకల సౌకర్యాలు కల్పించి మంచి ఉద్యోగం కూడా ఇచ్చారు.ఇలా ఆ అమ్మాయి పరిస్థితి పూర్తీగా మారిపోయింది.అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికా మీరు విదేశాలకు వెళ్ళేది అని ఒక క్వషణ్ కూడా అరైస్ అయ్యింది.కాబట్టి మీరు కూడా విదేశాలకు వెళ్ళాలి అంటే ఒక్కసారి ఆలోచించండి.ఎందుకంటే ఈ అమ్మాయికి జరిగిన ఘటనే మీకు కూడా ఎదురుకావోచ్చు.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే విదేశీ జీవితం గురించి అక్కడ అనుభవించే కష్టాల గురించి మీ అందరికి తెలిసేలా మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.