సిద్దిపేట శ్రీ లక్ష్మీ లాడ్జీలో చూస్తే షాకవ్వాల్సిందే

592

వ్యభిచారం…డబ్బు కోసం అడ్డదార్లు తొక్కుతున్న యువత ఎంచుకునే మార్గం.బీద అమ్మాయిల పరిస్థితిని చూసి వారిని ఈ వ్యభిచార గూబిలొకి లాగే వాళ్ళు ఎందరో.మన దేశంలో వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందురు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు. ఈ వ్యభిచార కూపంలో సినిమా తారలు, బుల్లితెర ఆర్టిస్టులు, మోడళ్లు కూడా ఉంటారు.అయితే వ్యభిచార నివాసాలను నడిపేవారు ఏకంగా సోషల్ మీడియానే వాడుకుంటున్నారు.ఫేస్ బుక్ వాట్సాప్ లలోనే భేరాలు నడిపిస్తున్నారు.అయితే కొందరు అయితే హోటల్స్ లలోనే వ్యభిచార దందాను నడుపుతున్నారు. ఇప్పుడు అలాంటి ఒక ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.మరి వ్యభిచార ముఠా గురించి తెలుసుకుందామా.

Image result for prostitute

సిద్దిపేట పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ లాడ్జీపై పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు. లక్ష్మీ లాడ్జ్‌లో వ్యభిచారం చేస్తున్న నలుగురు మహిళలు, నలుగురు పురుషులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో విటులు రాజయ్య, రాజు, నర్సింహులు, పెంటయ్యతో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సిద్దిపేట గ్రామీణ సీఐ వెంకటరామయ్య తెలిపారు. అక్కడికి వచ్చిన మీడియాకు వీళ్ళు మొహాలు చూపించడానికి అంగీకరించలేదు. అయితే ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే గుంటూరు అని ఆ మహిళలు చెప్పారు. అయితే సిద్దిపేటలో ఇలాంటి వ్యభిచార ముఠా దొరకడం ఇదే మొదటిసారి ఏమి కాదు. ఇంతకముందు కూడా చాలా హోటల్స్ లలో దొరికారు. పోలీసులు వాళ్లకు చెక్ పెట్టారు. అయినా కూడా ఇప్పటికి అక్కడక్కడా ఇలాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వ్యభిచారం జరుగుతున్నట్టు తమకు అందిన సమాచారం మేరకు లాడ్జ్‌పై దాడులు చేసినట్టు సీఐ వెంకటరామయ్య చెప్పారు. పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. వ్యభిచారం, పేకాట లాంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవని, అలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సిద్దిపేటలో దొరికిన ఈ వ్యభిచార దందా గురించి అలాగే సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న వికృత కార్యకలాపాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.