సెక్స్ రాకెట్ గుట్టురట్టు అడ్డంగా బుక్కైన రాజకీయ నాయకుడు

506

ఎక్క‌డ చూసినా ఇప్పుడు రోజుకు ఓ వార్త వ్య‌భిచార గృహ‌ల పై వ‌స్తూనే ఉంది.. కొంద‌రు పూట గ‌డ‌వ‌డం కోసం చేస్తుంటే, మ‌రికొంద‌రు అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించేదుకు ఇలాంటి అడ్డ‌దారులు తొక్కుతున్నారు.. ముఖ్యంగా సెక్స్ రాకెట్ రోజుకు ఒక‌టి బ‌య‌ట‌ప‌డుతున్నా, వీరి ఆగ‌డాలు మాత్రం ఆప‌డం లేదు.. పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు రోజూ ఎక్క‌డో ఓ చోట ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేసి, వారిని అరెస్ట్ చేస్తున్నారు.. అయితే ఇందులో మైనర్లు ఎక్కువ‌గా దొర‌క‌డం పెద్ద సంచ‌ల‌నం అవుతోంది.. అమ్మాయిల‌ను ట్రాప్ చేసి వారి అవ‌స‌రాల‌ను గుర్తించి, వారికి డ‌బ్బు ఎర వేసి, వారి శ‌రీరాల‌తో వ్యాపారం చేసుకుంటున్నారు.. ఇక ఏపీలో విశాఖ విజ‌య‌వాడ‌లో స్పెష‌ల్ డ్రైవ్ సెర్చ్ చేస్తున్నారు పోలీసులు.. అయినా వీరిలో మార్పు రావ‌డం లేదు.. ఇటీవ‌ల బ్యూటిపార్ల‌ర్లు స్పాల‌లో కూడా ఇలంటి అనైతిక ప‌నులు పెరిగిపోయాయి.

Image result for sex rocket

తాజాగా మ‌రో వ్య‌భిచార గృహం పై దాడి చేశారు పోలీసులు.. ఏలూరు ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఇలా వ్య‌భిచారం చేయిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మహానగరాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు కాంట్రాక్టు పద్ధతిపై పంపించే ఒక మహిళను ఏలూరు యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఎస్సై అరెస్టు చేశారు. ఏలూరులోని ఖండ్రికగూడెంకు చెందిన వెంకటలక్ష్మి ఖమ్మం జిల్లా నుంచి ఒక యువతిని తీసుకువచ్చి, చెన్నై, హైదరాబాదు, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు ఆ యువతిని అక్కడి వ్యభిచారం చేయడానికి కాంట్రాక్టు పద్ధతిపై ఐదు రోజులు, పది రోజులు పంపిస్తుంటుంది. సమాచారం అందుకున్న ఎస్సై గంగాభవాని తన సిబ్బందితో శనివారం రాత్రి దాడి చేయగా ఒక యువతి, ఒక విటుడు ఆ ఇంటిలో ఉన్నారు. వెంకటలక్ష్మిని అరెస్టు చేశారు. యువతిని, విటుడిని అదుపులోకి తీసుకుని ఏలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే వీరి వెనుక ఓ రాజ‌కీయ నాయకుడి హ‌స్తం ఉంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు మాత్రం ఎవ‌రు ఉన్నా ఎటువంటి రాజ‌కీయ నాయ‌కులు ఉన్నా, వారిపై కేసులు పెడ‌తాం అని అంటున్నారు.. మ‌రి చూడాలి ఈ కేసులో ఎటువంటి కోణాలు వెలుగులోకి వ‌స్తాయో. చూశారుగా ఇలాంటి చ‌ట్ట వ్య‌తిరేక అనైతిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డేవారిని మాత్రం వ‌దిలిపెట్ట‌కండి.. మీ ద‌గ్గ‌ర్లో ఇలాంటి ప‌నులు చేస్తే వాటి గురించి త‌ప్ప‌కుంటా పోలీసుల‌కు స‌మచారం అందించండి.