కాలినొప్పి అని ఆస్ప‌త్రికి వ‌స్తే డాక్ట‌ర్ ఎంత దారుణం చేశాడో తెలుసా..చివరికి ప్రాణంపోయింది.!

387

అనారోగ్యం అయితే ఆస్ర‌త్రికి వెళ్ల‌డం తెలిసిందే అయితే ఇప్పుడు దావాకానాలు కూడా బాగా క‌మ‌ర్షియ‌ల్ అయిపోయాయి హాస్ప‌ట‌ల్ కు వెళితే వేల‌కు వేలు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల బిల్లులు వేస్తున్నారు కార్పొరేట్ వైద్యం మిన‌హా ప్ర‌భుత్వ వైద్యానికి బ్ర‌తికే అవ‌కాశం లేకుండా పోయింది. చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చి ఆస్ప‌త్రికి వెళితే ఇక వారి ప‌ని అంతే అనేలా మారిపోయింది వైద్య వ్య‌వ‌స్త, తాజాగా ఓ వ్యక్తి కాలినొప్పి అని ఆస్ప‌త్రికి వ‌స్తే చివ‌ర‌కు అత‌నికి జ‌రిగినది తెలిస్తే క‌న్నీరు పెట్టుకుంటారు.ఆ కుటుంబానికి ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా ఒంటరి అయిపోయింది.

కాలి నొప్పితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తే వైద్యులు ఏకంగా కాటికే పంపారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల కథనం మేరకు . చీర్యాలకు చెందిన యాదయ్య గత కొద్ది రోజుల నుంచి వాస్కులర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. కాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చిన అతను వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ను సంప్రదించాడు. గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళంలో క్యానర్స్‌ గడ్డ ఉన్నందున శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.ఇందుకు .4లక్షల రూపాయ‌లు ఖర్చవుతుందన్నారు. యాదయ్య ఈ నెల 24న . 3 లక్షలు చెల్లించి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. 25న అబ్జ్వర్వేషన్‌లో ఉంచిన వైద్యులు 26న శస్త్ర చికిత్స చేశారు. రాత్రి 9గంటల సమయంలో యాదయ్య చనిపోయినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

యాదయ్యకు సంబంధించి అరుదైన క్లిష్టమైన కేసు. 1996 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం 22 కేసులు మాత్రమే గుర్తించారు. గుండె నుంచి రక్తం సరఫరా చేసే ప్రదాన రక్త నాళంలో క్యాన్సర్‌ గడ్డ ఉంది. ఇలాంటి కేసుల్లో శస్త్ర చికిత్స చేసినా బతకడం కష్టం. ఈ విషయాన్ని బంధువులకు ముందుగానే చెప్పాము అప్పుడే ఆప‌రేష‌న్ చేశాము అని ఇప్పుడు రివ‌ర్స్ అయ్యారు అని అంటున్నారు. మ‌రి దీనిపై కుటుంబం చెప్పేది వేరుగా ఉంది. దీనిపై పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. మ‌రి చూశారుగా ఈ విష‌యంలో వైద్య‌శాస్త్రం ప్ర‌కారం ఇది రేర్ కేస్ అంటున్నారు..