రైలు పట్టాలపై గర్భిణి.. ఎదురుగా ట్రైన్.. ఆతర్వాత?

431

మనం అద్భుతాల గురించి వినడమే తప్పా చూసింది లేదు.అక్కడ ఆ అద్భుతం జరిగింది.ఇక్కడ ఈ అద్భుతం జరిగింది అని చెప్తుంటే వింటాం తప్పా వాటి గురించి పూర్తీగా తెలియదు.అలాంటి ఒక అద్భుతం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.9 నెలల నిండు గర్బీని రైలు పట్టాల మీదనే ప్రసవించింది.ప్రసవించిన ఆమె మీద రైలు కూడా వెళ్ళింది.కానీ అక్కడే అద్భుతం చోటుచేసుకుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

మధ్యప్రదేశ్ భూర్హన్‌పూర్‌ జిల్లాలోని నేపానగర్‌ నివసించే ఒక మహిళ సాజిద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అనుమానంతో భర్త విడాకులు ఇచ్చేశాడు.అప్పటికే తను 9 నెలల నిండు గర్భిణి.విడాకుల తీసుకున్న తనకు జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలని భావించింది.ఈ జీవితం ఎందుకు? ప్రతిరోజు అనుమానంతో,అవమానంతో బతకడం కంటే చావడం మేలు అని నిర్ణయించుకుంది.ఆత్మహత్య చేసుకోడానికి రైల్వే ష్టేషన్ కు వెళ్లింది. సరిగ్గా రైలు రావడానికి 10 నిమిషాలు సమయం ఉంది.అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా పట్టాల మీదకి వచ్చింది. స్టేషన్లో ఉన్న వారంతా కేకలు వేస్తు ఆగమ్మా అంటూ ‌అరుస్తూనే ఉన్నారు.అవేమి తను వినిపించుకోలేదు.అయ్యో దేవుడా…కాపాడు అంటూ గట్టిగా అరవని వారు లేరు..అందరూ వద్దని అరుస్తూనే ఉన్నారు..కాపాడుదామని అడుగేసే లోపే మరో వైపు రైలు కూతపెడుతూ వేగంగా వస్తోంది.ఇక్కడ ఆమె కు నొప్పులు మొదలయ్యాయి.నిండు గర్భిణి కావడంతో.నొప్పులు భరించేలేక గట్టిగా అరవడం మొదలు పెట్టింది..ఆ రైలు అరుపులో తన అరుపులు ఎవరికీ వినిపించట్లేదు.రైలు దగ్గర దగ్గర గా వస్తోంది.హటాత్తుగా రైలు పట్టాలమీదే ప్రసవించింది ఆమె.ఏం చేయాలి అర్ధం కాలేదు తనకి, కింద పడివున్న పసికందును చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది, వెంటనే పుట్టిన బిడ్డను కడుపు మీద పెట్టుకుని అదిమి పట్టుకుంది.ఎంత కాదనుకున్నా అది కన్న పేగుబంధం.కళ్ళ ముందే, ఆ పసిప్రాణం పోకూడదనుకుంది కానీ ఎలా? పరిస్థితి చేదాటిపోయింది..

తాను నిస్సహాయురాలు..ఏమి చేయలేదు.ఒకవైపు తన్నుకొస్తున్న దుఖం, మరోవైపు తరుముకొస్తున్న మృత్యువు.అయ్యో దేవుడా ఈ దుస్థితి యే ఆడడానికి రాకూడదు అని అనుకుంది.ఇదంతా జరిగింది కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే.అప్పటికే రైలు వాళ్లిద్దరి మీదినుండి వెళ్లిపోయింది.కానీ ఆ తర్వాత అక్కడో అద్భుతం జరిగింది. పట్టాల మధ్యలో పడడంతో రైలు వాళ్ళ మీదనుండి వెళ్లినా..వాళ్లకు చిన్న గాయం కూడా అవలేదు. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్ కు గురికాగా, ఒక్కసారిగా హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఆర్పీఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ప్రతీ సమస్య కి చావే పరిష్కారం కాదు.ఒక్కసారి ఆలోచించండి.