భార్య ప్రియుడుతో అక్రమసంబందం పెట్టుకుందని తెలిసి భ‌ర్త ఎంత దారుణం చేశాడో తెలిస్తే షాక్

369

వారిద్ద‌రూ నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను ఎంతో ప్రేమ‌గా భార్య‌ని చూసుకున్నా, ఆమె ప్ర‌ణ‌య్ అనే వ్యక్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది అని భ‌ర్త‌కు తెలిసింది. ఇక దీనిపై భార్య‌ని నిల‌దీశాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు… తన ఆత్మహత్యకు కారణం భార్యేనని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాగుట్టలోని ప్రతాప్‌నగర్ లో ఉంటున్న ప్రశాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

శాంతంగా సాగుతున్న వీరి కాపురంలోకి ప్రణయ్ అనే యువకుడు ప్రవేశించాడు. అతనితో ప్రశాంత్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే దీన్ని మానుకోవాలని ప్రశాంత్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ, ఆమె ఏమాత్రం మారకపోగా, చచ్చిపోమంటూ ప్రశాంత్‌ను మాటిమాటికి దూషించేది… ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రశాంత్ ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన బంధువులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తన ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమని ప్రశాంత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రశాంత్ తన బావకు కొద్ది రోజుల క్రితమే ఫోన్ చేసి క‌న్నీరు పెట్టుకున్నారు.. తన భార్య వేధింపులు భరించలేకపోతున్నాని, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను తీవ్రంగా వేధిస్తోందని, పరువు పోతోందని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు… అంతేగాక, తాను చనిపోతానంటూ వాపోయాడు. అయితే, సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఉండాలని ప్రశాంత్‌కు అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు బయటికి వచ్చింది.మరోవైపు ఈ వ్యవహారంపై ప్రశాంత్ భార్య మాట్లాడుతూ.. తనకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రశాంత్ అనుమానించేవాడని తెలిపింది. రోజూ తనను వేధించేవాడని ఆరోపించింది. కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన అతని భార్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు.