ప్రణయ్ తల్లి హేమలత ప్రస్తుతం ఏం చేస్తుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

411

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.నిన్న ప్రణయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మారుతీరావు ను అరెస్ట్ చేశారు.చంపినా వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే ప్రణయ్ తల్లి ప్రేమలత మాత్రం ఇంకా కొడుకు విషాదం నుంచి బయటపడడం లేదు.అయితే అంత్యక్రియల తర్వాత ప్రేమలత ఇప్పుడెలా ఉంది.ఆమె ఏం చేస్తుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

Image result for pranay and amrutha

కొడుకును పోగొట్టుకుని పుట్టెడు శోక సంద్రంలో ఉంది ప్రణయ్ తల్లి ప్రేమలత.పెళ్లి చేసుకున్నాడు.ఇక సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు.త్వరలో మనువడు లేకుంటే మానవరాలో పుడతారని చాలా ఆనందంలో ఉంది..కానీ అమృత తండ్రి పన్నిన కుట్రకు తన కొడుకు బలవుతాడని హేమలత అస్సలు అనుకోలేదు.జీవితాంతం మంచిగా చూసుకుంటాడని అనుకున్న కొడుకు చనిపోవడం హేమలతని కుంగదీసింది.కొడుకు మరణ వార్త తెలిసిన ఆమె మీడియా దగ్గర మాట్లాడుతూ.. తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృతలను చూసి చిలకాగోరింకల్లా ఉండేవారు.తన కుమారుడి హత్యకు ఆమె కన్నీరుమున్నీరవుతోంది. మారుతీరావు కూతురికి తన కుమారుడి కన్నా మంచి భర్త దొరుకుతాడా, వాళ్ల కులంలో ఇంత మంచి వరుడు దొరుకుతాడా అని ఆమె ప్రశ్నించారు.

Image result for pranay and amrutha

మారుతీరావుకు తన కుమారుడి ఉసురు తగులుతుందని అన్నారు. మారుతీరావు కుటుంబం సర్వ నాశనం అవుతుందని అన్నారు.అయితే నిన్న అంత్యక్రియలు పూర్తీ అయ్యాయి.అంత్యక్రియలు తరువాత వారు ఇంటి లోపలనే ఉన్నారు.ఇళ్లు వదిలి బయటకు రాలేదు.బంధువులు కూడా కొంతమంది వారి దగ్గరే ఉండి వారిని ఓదార్చుతున్నారు.ముఖ్యంగా కోడలు అమృతను ఓదార్చే పనిలో ఉన్నదీ ప్రణయ్ తల్లి హేమలత.భర్త తన వల్లే చనిపోయాడని అమృత బాధపడుతుంది.అమృతను ఓదార్చడం ఎవరితరం అవ్వడం లేదు.అందుకే కోడలి దగ్గరే ఉంది హేమలత.అలాగే కొడుకు ఫోటో చూస్తూ తను కూడా ఏడుస్తూ ఉంది.ఈ వయసులో తోడుగా ఉంటాడని అనుకుంటే వదిలేసి పోయాడని ఆమె కన్నీరుమున్నీరు అవుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తిండి తినకుండా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు.కొడుకును తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంది.చిన్న కొడుకు అజయ్ ఓదార్చాలని చూస్తున్న ఆమె వినడం లేదు.కోడలిని పట్టుకుని ఏడుస్తుంది.ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్ ను చూస్తూ కొడుకు జ్ఞాపకాలను తలచుకుని బాధపడుతుంది.హేమలతను అమృతను చూసి బాధపడడం తప్ప ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నారు బంధువులు.వారు ఈ శోక సంద్రం నుంచి త్వరగా బయటపడి కోలుకోవాలని కోరుకుందాం.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పరువు హత్య గురించి అలాగే ఆమె మీడియాతో అన్న మాటల గురించి ఆలాగే ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.