NRIతో అమృతకు మరో పెళ్లి..అమృత తల్లి షాకింగ్ కామెంట్స్

243

తొమ్మిదో త‌ర‌గ‌తి చదువుకున్న స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి అక్క‌డ నుంచి త‌న జీవితాన్ని ఇప్పుడు ప్ర‌శ్నార్ధ‌కంగా మార్చుకుంది అమృత.. ప్ర‌ణ‌య్ హ‌త్య‌తో మారుతిరావు క‌ట‌క‌టాల పాల‌య్యాడు, ఆయన సోద‌రుడు శ్ర‌వ‌ణ్, అలాగే ఈ వ్య‌వ‌హారాన్ని ముందు ఉండి న‌డిపించిన వారు అంద‌రూ జైలుకి వెళ్లారు… ఇక కొంద‌రు మారుతిరావుకి స‌పోర్ట్ చేస్తుంటే, మ‌రి కొంద‌రు అమృత‌కి స‌పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మారుతిరావుకి చాలా మంది స‌పోర్ట‌ర్స్ పెరిగిపోయారు.. సోష‌ల్ మీడియాలో కూడా త‌ల్లి దండ్రుల నుంచి మారుతిరావు కి సపోర్ట్ గా పోస్టులు వ‌స్తున్నాయి.

ఇక అమృత విష‌యంలో ముందు నుంచి తండ్రి మారుతిరావు అమృతని ఎంతో గారాబంగా పెంచారు.. ఒక్క‌గానొక్క కూతురు అని అల్లారుముద్దుగా పెంచారు. స్కూల్ లో తొమ్మిదోత‌ర‌గ‌తి చ‌దువుకునే స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డింది అని తెలియ‌డంతో, అప్ప‌టి నుంచి ఆమెని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌లేదు అని అంటున్నారు, అయితే అమృత‌కు సోసైటిలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న కుటుంబానికి చెందిన, ఓ ఎన్నారై సంబంధాన్ని తీసుకువ‌చ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు.. కాని ప్ర‌ణ‌య్ ని త‌ప్ప‌తాను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పింది అమృత. కొద్ది రోజులు పెళ్లి గురించి మారుతిరావు సైలెంట్ గా ఉన్నా అమృత ప్ర‌ణ‌య్ తో ఇంకా ప్రేమ‌లో ఉండ‌టంతో, మ‌రింత ఆయ‌న విసిగిపోయాడు అని అంటున్నారు.

ఇక ఇప్పుడు అమృత త‌ల్లి కూడా ప్ర‌ణ‌య్ హ‌త్య జరిగిన త‌ర్వాత క‌నిపించ‌కుండాపోయింది. దీంతో ఆమె నుంచి అమృత‌కు పిలుపు వ‌స్తుంది అని అంటున్నారు.. మిర్యాల‌గూడ‌లోఉన్న వారి బంధువుల ద్వారా అమృత‌కి త‌న త‌ల్లి పిలుపు పంపుతారు అని అంటున్నారు. ఇక అమృత త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తాను అంటే ఇప్ప‌టికైనా పెళ్లి చేసి పంపిస్తామని, వారి త‌ల్లిచెబుతోంద‌ట‌, మ‌రి దీనికి అమృత ఒప్పుకుంటుందా అనేది చూడాలి, మ‌రో ప‌క్క ప్ర‌ణ‌య్ విగ్ర‌హం ఏర్పాటు చేసేవ‌రకూ ఎంత‌ తూరం అయినా పోరాటం చేస్తాము అని చెబుతున్న అమృత‌, ఈ విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అనేది చూడాలి. ఇక అమృత కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ అమృత‌ని ప‌ల‌క‌రించ‌లేదు అని చెబుతున్నారు. అయితే అమృత విష‌యంలో త‌న తండ్రిది నిజ‌మైన ప్రేమ అని కొంద‌రు అంటున్నారు.