ప్రణయ్ హత్య కేసులో కోర్ట్ షాకింగ్ జడ్జిమెంట్..చివరికిలా ముగిసింది

751

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్టాలలో కలకలం స్పృష్టించిన ఘటన మిర్యాలగూడ ప్రేమికుల ఘటన.కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నదని అల్లుడిని చంపించాడు మారుతీరావు.ఈ కేసును పోలీసులు చాలా తొందరగా పరిష్కరించారు.నేరస్థులు అందరు దొరికారు.ఇన్ని రోజులు కేసు కోర్ట్ లో నడిచింది.అయితే ఇప్పుడు వారికి శిక్ష పడింది.మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్టంలో సంచలనం స్పృష్టించింది.ప్రణయ్ హత్య తర్వాత రాష్టంలో పెద్ద దుమారమే లేపింది.నిందితుడు మారుతీరావుకు పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉండటం వలన ఈ ఘటన పెద్ద సంచలనం అయ్యింది.అంతేకాకుండా ప్రణయ్ కు విగ్రహం పెట్టాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు కోరడంతో ఈ ఇష్యు మీద పెద్ద పెద్ద చర్చలే నడిచాయి.ప్రణయ్ హిత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.A1 మారుతీరావు,A2సుభాష్ శర్మ,A3 అస్గర్ అలీ,A4 మహ్మద్ బారీ,A5 అబ్దుల్ కరీం,A6 శ్రవణ్,A7 శివ లను అరెస్ట్ చేసి విచారణ కొనసాగించారు.అయితే కేసులో ముగ్గురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.ముగ్గురు నిందితులపై హత్యతో పాటు గతంలో బెదిరింపులకు పాల్పడిన కేసులు ఉండటంతో ఈ కేసు విచారణ చేసిన ఎస్పీ పీడీ యాక్టు నమోదు చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కోరారు.

దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు, అతడి సోదరుడు శ్రవణ్, కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మహ్మద్ అబ్దుల్‌ కరీంలపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కేంద్ర జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరిని వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.వీరు సంవత్సర కాలం పాటు పీడీ యాక్ట్‌లో ఇక్కడే శిక్ష అనుభవిస్తారని తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురికి వేర్వేలు బ్యారక్‌లు కేటాయించామని డీఐజీ మురళీబాబు తెలిపారు.మరి మిగతా నిందితులకు శిక్షలు ఎప్పుడు పడతాయో చూడాలి.