వదిన కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ప్రణయ్ తమ్ముడు

622

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం లేపిన కుల అహంకార హత్య ప్రణయ్ హత్య గురించి మన అందరికి తెలిసిందే.చాలా మంది దీనిని పరువు హత్య అంటున్నారు.కానీ ఇది పరువు హత్య కాదు కుల అహంకార హత్య.అయితే దీని ద్వారా ఎక్కువగా నష్టపోయింది మాత్రం ప్రణయ్ భార్య అమృతా అనే చెప్పుకోవాలి.త్వరలో ఆమెకు ఒక బేబీ పుట్టబోతుంది.భర్త లేకుండా ఆమె జీవితం ఎలా కొనసాగిస్తుందని అందరు బాధపడుతున్నారు.అయితే ఈమెకు తోడుగా నేను ఉంటా అని ప్రణయ్ సోదరుడు అజయ్ చెప్పాడు.తన అన్న మరణం గురించి వదిన భవిష్యత్ గురించి అజయ్ మీడియా దగ్గర మాట్లాడాడు.మరి ఆయన ఏమన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు తన వదిన నాన్న కక్ష పెంచుకున్నారని అజయ్ ఏడుస్తూ చెప్పారు. అమృత తండ్రి, బాబాయ్ శ్రవణ్‌లను ప్రజలే చంపేస్తారని హెచ్చరించారు. ఇంతటి సైకో తండ్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు. అమృతకు ఆమె మమ్మీ ఎప్పటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటుందని, వీరు ఎక్కడకు వెళ్తున్నారో.. ఎక్కడకు వస్తున్నారో తల్లికి తెలుసునని, ఇది కక్ష మాత్రమే కాదని, నమ్మకద్రోహం అన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేశారన్నారని అజయ్ భావోద్వేగంగా మాట్లాడిన మాటల సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు అమృత పరిస్థితి ఏమిటి.ఆమెకు సహాయంగా అజయ్ ఏం చెప్తున్నాడో..అతని మాటల్లోనే విందాం.

Image result for pranay and amrutha

అతనికి మామూలు శిక్ష వేస్తే ఏదో ఒకరకంగా బయటకు వస్తాడు.బయటకు వచ్చి మళ్ళి మా ఫ్యామిలీకి ఏదో ఒక హాని కలిగిస్తాడు.కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి.అది త్వరగా జరగాలని కోరుకుంటున్నా.నా కుటుంబానికి ఎవరు అండగా ఉంటారనే టెన్షన్ లేదు.మా అన్నయ్య చనిపోయిన కూడా చాలా పెద్ద ఫ్యామిలీని నాకు ఇచ్చాడు.సమాజంలో చాలా మంది మాకు తోడుగా ఉండటానికి ముందుకు వస్తున్నారు.ఇంతమంది జనాలు వస్తారని నేను అనుకోలేదు.చాలా మంది కొడుకులను మా అమ్మానాన్నకు ఇచ్చి వెళ్ళాడు మా అన్నయ్య.మా వదినకు ఒక మంచి బ్రదర్ గా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటా.ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా.ఆమె జీవితంలో కష్టం అనేది లేకుండా చూసుకుంటా.త్వరలో బేబీ ప్రణయ్ వస్తున్నాడు.

ఆ బేబీని చాలా జాగ్రత్తగా చూసుకుంటా.బేబీ ప్రణయ్ క్యాస్ట్ సిస్టమ్ కు వ్యతిరేకంగా రిప్రసెంట్ అవుతాడని కోరుకుంటున్నా.మా బేబీని అలాగే పెంచుతా.కులం అనే దానికి అపోజిట్ గా బేబీని పెంచుతాం.ఒక బాబాయ్ గా ఒక తండ్రిగా బేబీని చూసుకుంటా.మా వదినకు కష్టం అనేది తెలియకుండా సొంత తమ్ముడిలా చూసుకుంటా అని ప్రణయ్ సోదరుడు అజయ్ చెప్పాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ కుల అహంకార హత్య గురించి అలాగే అమృత భవిష్యత్ గురించి అలాగే ప్రణయ్ సోదరుడు అజయ్ చేసిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.