చిలకా గోరింకల ప్రణయం అమృత రాసిన ప్రేమ కావ్యం గురించి తెలిస్తే కళ్ళలో నీళ్లు రావడం పక్కా

422

ఈ మధ్య కాలంలో జరిగిన అతికిరాతక ఘాతుకం ఏదైనా ఉందంటే అది మిర్యాలగూడ ప్రేమికుడిని చంపడమే.అల్లుడిని చంపేందుకు ఆ దుర్మార్గపు మామ పన్నిన కుట్రలో బంగారం లాంటి ప్రణయ్ చనిపోయాడు.ఘటన జరిగి వారం అవుతున్నా ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారంటే ఎంత ఘాతుకమో మనకు అర్థం అవుతుంది.అయితే ఈ ఘటన ద్వారా ఎక్కువగా నష్టపోయిందంటే అది ప్రణయ్ భార్య అమృత అనే చెప్పుకోవాలి.భర్తను కోల్పోయి జీవచ్ఛవంలాగా పడిపోయింది.ఎందుకంటే భర్త అంటే అంత ఇష్టం.అయితే అమృతకు ప్రణయ్ అంటే ఎంత ఇష్టమో తెలిపే ఒక విషయం బయటపడింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

అమృత ప్రణయ్ ను చూస్తే ఎవరికైనా చూడముచ్చటగా చిలకా గోరింకల్లా ఉన్నారు అని అనిపిస్తుంది. ఈడు జోడు ఎంతో అందంగా ఉంది. అతడిని చేసుకుని అమ్మాయి సంతోషంగానే ఉంది కదా. మరెందుకు నాన్నకి అంత కోపం. కులం పేరుతో కత్తులు దూశాడు. అమ్మాయి ముఖంలోని ఆనందాన్ని తుడిచేశాడు అని అనకుండా ఉండలేరు.అమృత సంతోషంగా ఉండాల్సిన సమయంలో కళ్లముందు అతి దారుణంగా హత్య చేసిన తన భర్త రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీళ్లతో కాలం గడుపుతోంది. ప్రణయ్‌తో తన ప్రేమాను బంధాన్ని తెలుపుతూ ఫేస్ బుక్‌‌లో పెట్టిన పోస్టు.ఆ పోస్ట్ లో ఏముందంటే.. ప్రేమంటో ఏంటో నిన్ను చూశాకే తెలిసింది. నీ చిరునవ్వు చూశాకే నవ్వితే ఇంత అందంగా ఉంటుందా అని తెలిసింది. నేను జీవించే ప్రతి రోజూ చాలా అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఎందుకంటే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిన దగ్గర్నుంచే రోజు ఇంత ఆనందంగా ఉంటుందా అని అనిపించింది. నీ తలపులతోనే రోజు ముగుస్తుంది. అని తమ మధ్య ఉన్న ప్రేమను అమృత వివరించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరో సందర్భంలో ప్రణయ్‌పై తనకు ఉన్న ఎంత ప్రేమ ఉందో తెలియ చెప్పే మరో పోస్ట్..నిజమైన ప్రేమకు ప్రతిరూపాలు హంసలు… అవి మాత్రమే జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి. 99 శాతం హంసలు కడవరకు ఒక్క భాగస్వామితోనే తమ ప్రేమను పంచుకుంటాయి. ఒకవేళ జీవిత భాగస్వామి మరణిస్తే అవి కూడా మరణిస్తాయి. నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుంది అని అమృత పోస్ట్ పెట్టింది.ప్రణయ్ పై అమృతకు ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ పోస్టు.వింటుంటే మనసు చలించిపోతుంది కదూ..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రేమకు చిరునామాలాగా ఉన్న ఈ అందమైన జంట గురించి వారి ప్రేమ ఎంత గొప్పదో తెలిపే ఈ పోస్ట్ ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.