ప్ర‌ణ‌య్ అమృత ల‌వ్ స్టోరీ చూస్తే క‌న్నీరు రాక‌మాన‌దు

466

న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో ప‌రువు హ‌త్య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది, ఒక్కొక్క‌టిగా ఈ హ‌త్య వెనుక ఉన్న వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. వేరే కులం వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది అని అమృత తండ్రి ఈ కులదుర‌ అహంకారానికి పాల్ప‌డ్డాడు, అమృత తండ్రి వైశ్య‌సామాజిక‌ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి, ఇక పెరుమాళ్ల ప్ర‌ణ‌య్ మాల కులానికి చెందిన వ్య‌క్తి, వీరి ప్రేమ న‌చ్చ‌క వేరే కులం కావ‌డంతో ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు అమృత తండ్రి మారుతిరావు… ఇక వారి ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో, ఆమె తెలియ‌చేసింది. ఓసారి వారి ప్రేమ ఎప్పుడు చిగురించింది అనేది తెలుసుకుందాం.

Image result for pranay and amrutha

మా ప్రేమ స్కూల్ టైం లోనే మొదలైంది. మేమిద్దరం 9 వ క్లాస్ లో ఉన్నప్పుడే ఒకరంటే ఒకరం ఇష్టపడడం. ఆ విషయం అప్పుడే ఇంట్లో తెలియడంతో నన్ను స్కూల్ మార్పించేసారు మా నాన్న. మేమిద్దరం అప్పటి నుండి అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను మాత్రం వదులుకోలేదు. దీంతో 2 సంవత్సరాల క్రితం అమృతకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఇంట్లోవాళ్ళు. ఆ సమయంలో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రణయ్,నేను చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే నాకు వేరే వ్యక్తితో పెళ్లి చేయరని నేను భావించాను. కానీ ప్రణయ తో వెళ్లకుండా తిరిగి నేను ఇంటికి వచ్చేసాను. ఇంట్లో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

Image result for pranay and amrutha

అతనికి దూరంగా ఉండమని లేదంటే చంపేస్తామని బెదిరించారు. ప్రణయ్ వాళ్ల ఇంటికి వెళ్లి మావాళ్లు గొడవ పెట్టుకున్నారు. అయినా నా శ్రేయస్సు కోరి ప్రణయ్ తల్లిదండ్రులు మావాళ్లని ఒక్క మాట కూడా అనలేదు. ఏమైనా అంటే ఆ కోపం నా మీద చూపించి నన్ను ఇబ్బంది పెడతారేమో అని వారు ఆలోచించారు. ప్రణయ్ ఇంట్లో వారంతా చాలా మంచివారు. మళ్లీ కొద్దీ రోజులకి నాకు పెళ్లి చేయాలని ఆలోచనలు మొదలెట్టారు మావాళ్లు. దీంతో జనవరిలో నేను ఇంటి నుండి వెళ్ళిపోయాను. పోలీసు అధికారులను ఆశ్రయించాము. అయితే వారు ఆరోజు రాత్రే మమ్మల్ని ఎక్కడికైనా వెళ్లిపొమ్మని సూచించారు. కానీ రాత్రి సమయంలో వెళ్లడం మంచిది కాదని మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ వెళ్ళాం.

Image result for pranay and amrutha

ఈ విషయం ప్రణయ్ తల్లిదండ్రులకి తెలిసింది కానీ వారు మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా నన్ను కోడలిగా అంగీకరించారు. కొద్దీ రోజులకి మేము హైదరాబాద్ నుండి ప్రణయ్ వాళ్ల ఇంటికి వచ్చేసాము. ఇంట్లో అందరు నన్ను బాగా చూసుకునేవారు. ఇక్కడ ఉంటె ఎప్పటికైనా ప్రమాదం అని మేము అబ్రాడ్ వెళ్ళడానికి పాస్ పోర్టులు కూడా రెడీ చేసుకున్నాము. కానీ అప్పుడే నాకు ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ సమయంలో తెలియని ప్లేస్ లో ఉండటం మంచిది కాదని ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాం. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ప్రణయ్ మూడు పూటలా నాకు తినిపించేవాడు. అతనే వంట చేసేవాడు. మా మరిది కూడా ఫారెన్ నుండి వచ్చాడు. అతను మూడు రోజుల క్రితమే తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఉన్నప్పుడు వదినా నీకు ఏం తినాలనిపించిన చెప్పు చేసి పెడతానంటూ అన్నీ వండి పెట్టేవాడు. వాళ్ళకి సిస్టర్స్ లేరు. నన్ను తన సిస్టర్ లా చూసుకునేవాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రణయ్ నన్ను జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చిన రోజు మా ఇద్దరికీ మాట్లాడుకోటానికి కూడా కుదరలేదు. తిరిగి వెళ్తున్న సమయంలో మా నాన్న ఫోన్ చేశాడు కానీ నేను లిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్ లో ఉన్నట్టు మా నాన్నకి అర్ధమవుతుందేమో ఎటాక్ చేస్తాడేమో అనే భయంతో చేయ‌లేదు . అప్పుడు ప్రణయ్ ఫోన్ లిఫ్ట్ చేయమని నవ్వుతున్నాడు. ఇంతలోనే ప్రణయ్ ని చంపేశారు. నా కడుపులో ప్రణయ్ కి ఇష్టమైన బేబీ ఉంది కాబట్టి బ్రతికి ఉన్నాను. లేదంటే నేను కూడా చనిపోయేదాన్ని. ప్రణయ్ కి పిల్లలంటే చాలా ఇష్టం. అతని బిడ్డని కని బాగా పెంచితే ప్రణయ్ ఆత్మ సంతోషిస్తుంది. అందుకే నేను బ్రతికి ఉన్నాను. నేను పడుతున్న నరకం ఎవరికీ రాకూడదు. అంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌ణ‌య్ నిజ‌మైన ప్రేమికుడు అలాంటి వ్య‌క్తిని చంపి ఏం సాధించారు అంటూ మిర్యాల‌గూడ‌లో యువత పెద్ద ఎత్తున శోక‌సంద్రంలో ఉన్నారు, చూశారుగా ఈ చిల‌కాగోరింక‌ల‌ను వేరుచేసి మారుతిరావు సాధించింది ఏమీ లేదు, ఇలాంటి కుల పిచ్చి వ్య‌క్తుల‌ను స‌మాజం నుంచి వెలివెయ్యాల్సిందే అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.