ప్రభాస్ పెళ్లి ఫిక్స్.. అక్టోబర్ 23 న పెళ్లి..అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్..

493

బాహుబలి స్టార్ ప్రభాస్ మరో నెల రోజుల్లో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసారి యంగ్ రెబల్ స్టార్ నుండి సర్‌ప్రైజింగ్ న్యూస్ వింటామని అభిమానులు ఆశ పడుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్, ట్రైలర్ లాంటివి అభిమానులు ఆశించడం సర్వసాధారణమే. అయితే ఫ్యాన్స్ ఈ సారి అంతకు మించిన సర్‌ప్రైజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.అదేమిటి అంటే ఆయన పెళ్లి న్యూస్.అయితే ఆయన పెళ్ళికి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.మరి ఆ వార్త గురించి తెలుసుకుందామా.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇద్దరు స్టార్స్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని స్పష్టం చేశారు. గతంలో అనుష్క తల్లి మీడియాతో మాట్లాడుతూ…. ప్రభాస్ లాంటి వ్యక్తి తమ కూతురుకు భర్తగా దొరకాలని తాము కూడా కోరుకుంటున్నామని, అయితే వారి మధ్య అలాంటి ఉద్దేశ్యం లేనపుడు దీని గురించి మాట్లాడం అనవసరం అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దాంతో ఆ వార్తలు పక్కన పెట్టేశారు.అయితే ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గత కొన్ని రోజులుగా ఈ బాహుబలికి తగిన జోడీని వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించిన రూమర్స్‌కు తెరదించాలని వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి వార్త అతి త్వరలోనే ఆయన పెదనాన్న కృష్ణం రాజు ద్వారా బ్రేక్ చేయబోతున్నారని, అది కూడా ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.కృష్ణంరాజూ వాళ్లకు పాత చుట్టాలు అయినా ఒక ఫామిలీ అమ్మాయిని చూశారని అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చడం జరిగిపోయిందని తెలుస్తుంది.అమ్మాయి అమెరికాలో mba చేసినట్టు సమాచారం.ప్రభాస్ పుట్టినరోజున ఈ విషయం అధికారంగా ప్రకటించాలని కృష్ణం రాజు అనుకుంటున్నాడట.ఇదే అభిమానులకు ఇచ్చే గిఫ్ట్ అని తెలుస్తుంది.సాహో సినిమా తర్వాత వీళ్ళ పెళ్లి ఉండబోతుందంట.ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఇంతలా ఆందోళన చెందడానికి కారణం ప్రభాస్ వయసే. యంగ్ రెబల్ స్టార్ 40కి దగ్గరవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. 40 లోపే తమ అభిమాన హీరో పెళ్లి జరిగిపోవాలని వారు ఆశ పడుతున్నారు. మరి ఈ పుట్టినరోజునైనా ప్రభాస్ తన పెళ్లి విషయంలో అభిమానుల్లో నెలకొన్ని టెన్షన్ దించేస్తారో లేదో చూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.