ప్రణయ్ హ‌త్య పై ప్ర‌భాస్ షాకింగ్ కామెంట్స్

450

కులం గోడ‌లు ఇంకా మ‌న స‌మాజంలో చాలా గ‌ట్టిగా ఉన్నాయి అని చెప్ప‌డానికి తాజాగా జ‌రిగిన మిర్యాల‌గూడ, ప్ర‌ణ‌య్ హ‌త్య ఉదంత‌మే ఉదాహ‌ర‌ణ.. త‌న క‌న్న‌బిడ్డ కోసం అవ‌త‌ల వారి క‌న్న‌బిడ్డ‌ని చంప‌డం అనేది మానుషం, ఇది కుల దుర అహంకార హ‌త్య‌గానే చెప్పాలి.ఇప్పుడు మారుతిరావు చేసిన హ‌త్య గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు..అమృత తండ్రి మారుతీరావు, కిల్ల‌ర్ శ‌ర్మ ఇతరులు పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే తన తండ్రిని ఉరి తీయాలని అమృత అంటుంది.రాజకీయ నేతలు, కుల సంఘాలు, సామాజిక వేత్తలు ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఓదార్చుతున్నారు. విచారణ సాగుతోంది.అయితే ఇప్పుడు ఈ విషయం మీద టాలీవుడ్ స్టార్ ప్ర‌భాస్ స్పందించారు. ఇలాంటి అమానుష ఘ‌ట‌న‌ను ఆయ‌న ఖండించారు అలాగే కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Image result for prabhas

మిర్యాలగూడ ఘటన సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలను కూడా కదిలిస్తోంది. ప్ర‌భాస్ ను ఈ ఘ‌ట‌న క‌లిచివేసింది. ఇప్ప‌టీకీ ఈ విషయం మీద సింగర్ చిన్మయి,మంచు మనోజ్,హీరో రామ్ లాంటి వాళ్ళు స్పందించారు. ఇలాంటి చూడ‌చ‌క్క‌ని జంట‌ని చూసి అస‌లు మారుతి రావుకి చంపాలి అని ఎలా అనిపించింది అని ప్ర‌భాస్ బాధ‌ప‌డ్డారు.. భ‌ర్తను కోల్పోయి ఉన్న అమృత‌కు సొంత అన్న‌య్యలా అండ‌గా ఉంటాను అని అన్నార‌ట ప్రభాస్ , అమృత తండ్రిని విడుద‌ల చేస్తే త‌న త‌ప్పు తెలుసుకుంటాడు అని అన్నార‌ట‌, ఇలా ఎందుకు ప్ర‌భాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని అంద‌రూ ఆలోచిస్తున్నారు, కాని దీని వెనుక ఓ మాట అన్నారు ప్ర‌భాస్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ప్ర‌ణయ్ అమృత జంట‌ను విడ‌దీసి మారుతిరావు సాధించింది ఏమీ లేదు.. ఇలాంటి ఉన్మాదులను జైళ్లో ఉంచి అత‌నికి ఫుడ్ పెట్ట‌డం వ‌ల్ల తాను చేసిన త‌ప్పు తెలుసుకోడు అని ప్ర‌భాస్ అన్నార‌ట.. ఇలాంటి వారిని బ‌య‌ట ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర వ‌దిలేస్తే వారే అత‌నికి శిక్ష విధిస్తార‌ని అన్నాడ‌ట ప్ర‌భాస్.. ఇలాంటి నింధితుల‌ను జైళ్లో పెట్ట‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని ఇలాంటి వారికి దారుణ‌మైన శిక్ష దుబాయ్ లో ఎలా వెంట‌నే విధిస్తారో, అలా విధిస్తే తెలుస్తుంది అని ప్ర‌భాస్ అన్నార‌ట‌. అప్పుడు తాను చేసింది ఎంత పెద్ద త‌ప్పో చివ‌రిక్ష‌ణాల్లో తెలుసుకుంటాడ‌ని అన్నార‌ట, ఇలాంటి వారిని ఉరితీయాల‌ని ఊరికిని వ‌దిలేస్తే మ‌రికొంద‌రు మారుతిరావులు స‌మాజంలో వ‌చ్చే అవ‌కాశం ఉంది అన్నాడు ప్ర‌భాస్, ఇలా సెల‌బ్రెటీలు రాజ‌కీయనాయ‌కులు మారుతి రావుచేసిన ప‌నికి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. చూశారుగా ఇలా సెల‌బ్రెటీలే కాదు మీరు కూడా దీనిపై ఏ మ‌నుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.