వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

412

సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. హిందూ సంప్రదాయాల్లో అతి పెద్దదైన, ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ పండుగ తర్వాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ పండుగను ఎంతో పవిత్రతో చేసుకోవాలి.కానీ కొందరు ఈ పండుగను చాలా నీచంగా జరుపుకుంటున్నారు.అశ్లీల నృత్యాలు దేవుడి ముందు ఆడుతూ పాపపు పనులు చేస్తున్నారు.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు తమ నచ్చిన రీతిలో గణేషుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఊరువాడా ఎక్కడ చుసిన గణేశుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. అయితే గణనాథుడి వేడుకల్లో భాగంగా కొందరు వ్యక్తులు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తున్న నలుగురు మహిళలు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన కృష్ణా జిల్లా విజయవాడ శివారు నున్న సమీపంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక నున్న సమీపంలో కొందరు చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహం తెచ్చారు. గురువారం సాయంత్ర పూజలు నిర్వహించారు.

Image result for vinayaka chavithi sambaram village dance

అనంతరం రాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపం వద్ద కొందరు యువకులు మహిళలను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులతో పాటు నృత్యాలు చేస్తున్న మహిళలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. వారిపై 290, 294 సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.ఒక్క వీళ్ళే కాకుండా దేశంలో చాలా మంది ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాంటి వారందరు దొరకకపోవచ్చు కానీ ఆ దేవుడి ముందు ఆడుతున్నారు.అంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మీకు తగిన శిక్ష వేస్తాడు.కాబట్టి ఇలాంటి పాడు పనులకు దూరంగా ఉండాలని కోరుతున్నాము.దేవుడి పండుగను పద్దతిగా ఎలాంటి అకృత్య పనులు చెయ్యకుండా చేసుకుందాం.మరి మీరేమంటారు.వినాయక చవితి చేసుకోవాల్సిన విధానం గురించి అలాగే కొందరు దుర్మార్గులు ఇలా వినాయక చవితి పండుగ రోజున ఇలా చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.