వింత: కుక్కను పెళ్లి చేసుకున్న ప్రముఖ మోడల్

138

ఒకప్పుడు పాత కాలంలో ఏదో జాతక దోషం ఉన్నప్పుడు గాడిదలకు ఇచ్చి పెళ్లి చేయడం గురించి ఎక్కడో ఒక చోట విని ఉంటాం. అయితే ఈ తరంలో మాత్రం అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం వంటి వింత పెళ్లిళ్లు గురించి కూడా వింటున్నాం. కానీ ఇప్పుడు వినూత్నంగా కుక్కను పెళ్లి చేసుకుంది ఒక మహిళ..సాదాసీదా మహిళ ఏమీ కాదు ఆమె ప్రముఖ మోడల్ కావడం విశేషం. మరి ఆ మోడల్ కుక్క పెళ్లి గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for ఎలిజబెత్ హాడ్

నిన్నటివరకూ ఎలిజబెత్ హాడ్ ఓ మోడల్‌గా మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు మాత్రం కుక్కను పెళ్లి చేసుకున్న మోడల్‌గా ఆమె టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యింది. ఈ కుక్క పేరు లాగాన్. పెంపుడు కుక్క ని పెళ్లి కొడుకు లా తీర్చి దిద్ది మరీ పెళ్లి చేసుకుంది. లాగాన్ కు వెడ్డింగ్ చైన్ తొడిగి జీవితాంతం తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేసింది. తాను పెంచుకుంటున్న కుక్క లోగాన్ చాలా మంచిదని, అది ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదనీ, ఎంతో విశ్వాసంగా ఉంటుందనీ వివరించింది. అందుకే దాన్నే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రతిరోజూ వాకింగ్ కు తీసుకెళతా, నా అల్మారా లో ఉన్న వన్నీ కూడా షేర్ చేస్తా, అన్ని ముచ్చట్లు తనతోనేనంటూ ప్రమాణాలు కూడా చేసి మరీ పెళ్లాడింది. మళ్లీ ఈ తతంగం అంతా కూడా ఒక టీవీ ఛానల్ లైవ్ కూడా ఇచ్చింది.. ప్రస్తుతం అందరూ ఈ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే చాలా ప్రేమ వ్యవహారాలు నడిపింది. ఎలిజబెత్ హాడ్ ఇప్పటివరకూ 220కి పైగా రిలేషన్‌షిప్‌లు మెయిన్‌టేన్ చేసింది. గోల్ఫర్ సీవ్ బల్లెస్టోర్స్, ఫార్ములా వన్ డ్రైవర్ జమ్స్ హంట్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. 8 ఏళ్లుగా ఆమె ఆరు డేటింగ్ సైట్లలో రకరకాల వ్యక్తుల్ని కలుసుకుంది. వాళ్లతో తిరిగింది. ఎవ్వరూ నచ్చలేదు. తనకు మగాళ్లతో ప్రేమ వ్యవహారాలేవీ సెట్ కాలేదని, ఎన్నో లవ్ ఫెయిల్యూర్‌ల తర్వాత చివరకు కుక్కను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. స్విమ్ మోడల్ గా సంచలనం సృష్టించిన ఈ భామ తన పెంపుడు కుక్క ని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు . కొంతమంది ఎలిజబెత్ ని ఆశీర్వదిస్తుండగా, మిగతా వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కుక్కను పెళ్లి చేసుకోవడం ఏంటి పిచ్చికాకపోతే అని అంటున్నారు. మొత్తానికి తన పెళ్లి తో సంచలనం సృష్టించాలని అనుకున్నట్లుంది, అందుకే కుక్క ని పెళ్లి చేసుకుంది. నిజంగా అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనేది పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయం పక్కదారి పట్టి ఇలాంటి కొత్త కొత్త పెళ్లిళ్లు బయటకొస్తున్నాయి. మరి ఈ కుక్క,మోడల్ ల పెళ్లి ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి..