నడిరోడ్డుపై కాలేజీ కి వెళ్తున్న బాలికలను ఈ పోలీసోడు ఏం చేశాడో తెలిస్తే ఛీ అంటారు.

431

పరువు, కులం పేరుతో ప్రేమజంటలను నరకడం ఫ్యాషన్‌గా మారింది కొంతమంది కులాహంకారపెద్దలకు. ఆ సంగతి పక్కనబెడితే ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించాల్సిన ఖాకీల్లో కొందరు దారితప్పుతున్నారు. దొంగచాటుగా చేసే అఘాయిత్యాలను ఇప్పుడు పట్టపగలు నడిరోడ్డుపైకీ తీసుకొస్తున్నారు. నడిరోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను ఓ హోం గార్డు ఏం చేశాడో తెలిస్తే అసలు వీడు పోలీసా అని అనుకుంటారు.మరి ఆ పోలీస్ ఏం చేశాడో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for police viral behaviour

బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో భాగంగా ఉండి, మహిళలకు, విద్యార్థినులను రక్షణ కల్పించాల్సిన ఓ హోమ్ గార్డు, విధులు నిర్వహిస్తూ, తనలోని కామ ప్రకోపాన్ని చూపించాడు. కొచ్చిలోని తివారాలో ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డుకు ఆ పనితోపాటు మరో దురద పని కూడా ఉంది. కనిపించిన అమ్మాయిల నడుమును, ఇతర భాగాలను తాకే పైత్యమంది.ఆడపిల్ల కనపడితే చాలు మనోడి చెయ్యి ఆగదు.పబ్లిక్ ప్లేస్ అని చూడడు.ప్రైవేట్ ప్లేస్ అని చూడడు.నడిరోడ్డు అని చూడడు.ఆడపిల్ల కనపడితే చాలు అమ్మాయిని అసభ్యంగా తాకుతాడు.ఇప్పుడు తివారాలో ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వికృత ఆనందం పొందాడు.

Image result for police viral behaviour

అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, సదరు హోమ్ గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.ఈ వీడియో చూసిన వారెవరికైనా మహిళల భద్రత విషయం ప్రశ్నార్థకంగానే ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అన్ని సార్లు అమ్మాయిలను పోలీస్ మ్యాన్ తాకినప్పుడు అమ్మాయిలు ముందుగానే ఎందుకు ఎదురుతిరగలేదు. పోలీస్ కాబట్టి ఆ వ్యక్తిని చూసి భయపడ్డారా? పొరపాటున చేయి తగిలిందని భావించి ఉండవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ అదే విధంగా అసభ్యకరంగా తాకుతున్నప్పుడు ఆ వీడియో తీసిన వ్యక్తి అయినా నలుగురిని పిలిచి ఆ పోలీసోడు చేసిన వికృత పనిని చూపిస్తూ నాలుగు తగిలించాల్సింది.అప్పుడు గానీ మరొకరు ఇలా చెయ్యడానికి భయపడేవారు.ఏది ఏమైనా మన సమాజంలో మహిళలకు సామాన్య ప్రజల నుంచే కాకుండా వాళ్ళను కాపాడాల్సిన పోలీసుల దగ్గర కూడా రక్షణ లేకుండా పోయిందని తెలుస్తుంది.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ గురించి అలాగే అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వికృత ఆనందం పొందిన ఈ పోలీసోడి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.