ఫోన్ తో అడ్డంగా దొరికిపోయిన పోలీస్… ఛీఛీ ఇంత దారుణ‌మైన ప‌నిచేశాడా అంటారు

444

కొంద‌రు ఖాకీ దుస్తులకు వ‌న్నె తెస్తే మ‌రొకంద‌రు, ఆ ప‌రువును గంగ‌లో క‌లుపుతున్నారు.. అలాంటి ఓ ప్ర‌బుద్దుడు చేసిన ప‌నికి ఓ అమ్మాయి పోలీస్ స్టేష‌న్ ముందు త‌న‌కి న్యాయం కావాలి అంటూ కోరుకుంటోంది.. ఓ కానిస్టేబుల్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ గొల్లపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఒక యువతి ఆందోళనకు దిగింది., పోలీసులు ఆమె బంధువులు ఇలా అంద‌రూ కూడా వీరి క‌థ విని షాక్ అయ్యారు.

Related image

శలపాకకు చెందిన వాకపల్లి నాగబాబు ఇండియన్‌ టిబెట్‌ బోర్డర్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా హర్యానాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పోలినాటి సంధ్య, నాగబాబు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సంధ్య కాకినాడలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుతుంది. ఈ క్రమంలో జూలై 23న సంధ్యతో కలిసి నాగబాబు బైక్‌పై వెళుతున్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట కూడలిద‌గ్గ‌ర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రికీ గాయాలయ్యాయి. దీంతో వారి ప్రేమ సంగతి తెలుసుకున్న యువతి కుటుంబ‌స‌భ్యులు ఇరువురికీ వివాహం చేయమని నాగబాబు కుటుంబీకులను అడిగారు. నాగబాబు ఆసుపత్రి నుంచి వచ్చాక మాట్లాడదామంటూ అతడి తల్లిదండ్రులు విషయాన్ని దాటవేశారు..

Image result for indian lady infront of the police station

దీంతో సంధ్య కుటుంబీకులు జూలై 29న కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నాగబాబు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణ‌యించుకున్నాడు. అదే రోజు రాత్రి శలపాక గ్రామానికే చెందిన దడాల పద్మశ్రీ అనే మరో అమ్మాయిని తుని చర్చిలో వివాహం చేసుకున్నాడు. దీంతో సంధ్య మంగళవారం తన బంధువులతో వచ్చి గొల్లపాలెం పొలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. ఎస్సై షేక్‌ జబీర్‌ ఆందోళనకారులను శాంతింపజేసి నిందితుడు నాగబాబును పోలీసు స్టేషన్‌కు రప్పించారు. తాను ముందు నుంచీ దడాల పద్మశ్రీనే ప్రేమిస్తున్నానని జూలై 14న తమ ఇద్దరికీ వివాహమైందంటూ అబద్ధం చెప్పాడు.

సంధ్య ఆరోపించినట్టుగా తమ విహహం జూలై 29న జరగలేదని, ఆ రోజు తాను గాయాలతో ఆసుపత్రిలో ఉన్నానని నిందితుడు ఫొటోలు, ఇతర ఆధారాలు చూపి, పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు, అతడి స్నేహితుల సెల్‌ఫోన్లు సేకరించిన ఎస్సై షేక్‌ జబీర్‌ ఇరు వర్గీయులను విచారించారు. బాధితురాలు జూలై 29న ఎస్పీకి ఫిర్యాదు చేశాక, అదే రోజు రాత్రి నిందితుడు దడాల పద్మశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సమయానికి అతడికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలు బయట పెట్టారు. దీంతో నిందితుడు నాగబాబు తాను చేసిన మోసాన్ని అంగీకరించాడు. ఇక ఇలా మోసం చేసి పెళ్లిచేసుకున్న భార్య‌ను మోసం చేశాడు.. ఇలా ప్రేయ‌సిని కూడా రోడ్డుపైకి తీసుకువ‌చ్చాడు.. అందుకే జ‌ర జాగ్రత్త అనేలా ఈ సంఘ‌ట‌న అక్క‌డ వారిని హెచ్చ‌రించింది చూశారుగా ఈ కానిస్టేబుల్ కి ఎటువంటి శిక్ష విధించాలో మీరే తెలియచేయండి.