కిడారి హత్యలో బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ నిజం హ‌త్య‌లో ప్ర‌ముఖ టీడీపీ నేత కుట్ర.?

310

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యేను ఉచ్చులోకి లాగింది సొంత పార్టీ నాయకుడేనా ఇప్పుడు ఈహ‌త్య‌పై రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది ముఖ్యంగా ఎమ్మెల్యే ని మాజీ ఎమ్మెల్యేని చంపే అంత దైర్యం న‌క్స‌ల్స్ కు ఎలా వ‌చ్చింది…? నక్సల్స్‌కు ఆశ్రయం కల్పించింది అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీయా..? ఆశ్చర్యకరమైన ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేయాలనుకున్న మావోయిస్టులు.. ఆయనకు దగ్గరగా ఉండే వారినే పావులుగా ఉపయోగించుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అరకు నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీటీసీ నక్సల్స్‌కు మూడు సార్లు ఆశ్రయం కల్పించినట్లు పక్కా ఆధారాలు లభించాయి.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. మావోయిస్టులు కిడారిని హత్య చేయాలనుకోగానే రాజకీయంగా ఆయనతో ఎవరు విభేదిస్తున్నారో ఆరా తీశారు. మన్యంలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడి.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీని ఆగస్టులో రహస్య స్థావరానికి పిలిపించుకుని మాట్లాడారు. తర్వాత టీడీపీ మండల స్థాయి నాయకుడితో భేటీ అయి.. ఎమ్మెల్యేను రప్పించేందుకు ఒప్పించారు. ఇంకోవైపు.. సెప్టెంబరు 5న ఎంపీటీసీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మావోయిస్టులు, స్థానిక టీడీపీ నాయకుడు చర్చలు జరిపారని తెలిసింది. గ్రామాల్లోకి ఎమ్మెల్యే వచ్చే ముందు సమాచారం తమకు చేరవేయాలని నక్సల్స్‌ సూచించినట్లు తెలిసింది. సెప్టెంబరు 19న గ్రామదర్శినికి రావాలని ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆహ్వానించాడు. వస్తానని కిడారి చెప్పడంతో మావోయిస్టులకు చేరవేశాడు. రెండు రోజులు ముందుగానే గ్రామానికి చేరుకున్న కొందరు నక్సల్స్‌.. ఎమ్మెల్యే హత్యకు పథక రచన చేశారు. మావోయిస్టు మిలిటరీ కమిటీ విభాగానికి అనుకూలతలు, ప్రతికూలతలు వివరించారు. రంగంలోకి దిగేముందు అరుణ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లిపోయింది. సెప్టెంబరు 19న అక్కడకు చేరుకుని కార్యాచరణకు సిద్ధమైంది. అదే సమయంలో ఎమ్మెల్యే భార్య అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చి ఆయన రాలేక పోయారు. దీంతో మావోయిస్టుల ప్లాన్‌ అప్పుడు ఫలించలేదు.

భార్య అనారోగ్యం వల్ల గ్రామదర్శిని వాయిదా వేసుకున్న ఎమ్మెల్యే ఆదివారం(సెప్టెంబరు 23న) కచ్చితంగా వస్తానని స్థానిక నేతలకు ఫోనుచేసి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి అనుచరులతో వెళ్తుండగా లిపిటిపుట్టు వద్ద రెండు వాహనాలను మావోయిస్టులు చూశారు. ఊరి బయట ఓ 15 గిరిజన నివాసాలున్న జంక్షన్‌లో మాటు వేసి ఉన్న సాయుధ మావోయిస్టులకు ఈ సమాచారం అందించారు. అప్రమత్తమైన దళం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి ఆయన్ను కిందకు దించింది. అదే సమయంలో సారాయి గూడెం వైపు నుంచి వస్తున్న వాహనాలను, పాదచారులను అక్కడున్న మరో దళం అడ్డుకుంది. గ్రామంలో ముందుగా వాహనాలను చూసి సాయుధ మావోయిస్టులకు సమాచారం అందించిన బృందం గ్రామంలోని గిరిజనులు అటువైపు వెళ్లకుండా అడ్డుకుంది. కాసేపు ఎమ్మెల్యేతో, సివేరితో మాట్లాడిన మావోయిస్టులు వారిని కాల్చిచంపారు.