Breaking News:గ‌న్ తో బెదిరించిన ఆ హీరోయిన్ ని పోలీసులు ఎంత దారుణంగా చంపారో చూడండి

428

ఒక్కోసారి మనం చేసిన పనులే మన ప్రాణాలపైకి తెస్తాయి.. పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ హాలీవుడ్‌ నటి.. మ‌నం చేసే ప‌ని ఎంత
జాగ్ర‌త్త‌గా చేయాలో, అలాగే వేళాకోలాలు కూడా ఎక్క‌డ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. పోలీసుల‌తో వేళాకోలం ఆడింది చివ‌ర‌కు ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంది. అస‌లు వివ‌రాల్లోకి వెళితే

ఎదురుగా ఉన్న నటి చేతిలో ఉన్న బొమ్మ తుపాకి చూసి నిజమైనది పోలీసులు అనుకున్నారు. అంతలో పోలీసులవైపు గన్‌ చూపించడంతో బెదిరిపోయిన ఓ ఆఫీసర్‌ ఆమెను
కాల్చిచంపాడు. సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటన అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. ఎన్నో హాలీవుడ్‌ సీరియల్స్‌, షోలతో ఆకట్టుకున్న నటి వెనిస్సా
మార్క్వెజ్‌పై పోలీసుల కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తీరుపట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

46 ఏళ్ల వెన్నిస్సా మార్క్వెజ్‌ను స్థానిక పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
‘పోలీసులు నటి ఇంటికి వెళ్లే సరికి చేతిలో హ్యండ్‌ గన్‌తో ఉంది. మాట్లాడుతుండగానే అధికారులను టార్గెట్‌ చేయడంతో బెదిరిపోయిన ఓ అధికారి ఆమెపై కాల్పులు జరిపాడు.
దీంతో వెన్నిస్సా అక్కడికక్కడే మృతి చెందారు. అక్క‌డ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా వెనిస్సా చేతిలో ఉంది నిజమైన తుపాకీ కాదని బొమ్మ గన్‌గా గుర్తించాము అని
తెలియ‌చేశారు. అయితే వెనిస్సా గన్‌తో అలా ఎందుకు ప్రవర్తించిందో తెలియట్లేదు. తను కొద్దికాలంగా మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతుందని తెలిసింది. పూర్తి వివరాల
కోసం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామ‌ని పోలీసు ఉన్నతాధికారులు తెలియ‌చేశారు.వెనిస్సా గతంలో తన సహనటుడు జార్జ్‌ క్లూనీ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. దీంతో పలువరు క్లూనీపై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ ఘటనకు సంబంధించి అందరూ అనుకుంటున్నది నిజం కాదు. నేను నటున్ని మాత్రమే. వెనిస్సాను నేను చంపిచానడం అసత్యం’ అంటూ క్లూనీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన
పూర్తి వివరాలు తెలియాల్సివుంది.అయితే పోలీసులు అన్ని విదాలుగా ఈ కేసు విచార‌ణ‌చ చేస్తున్నారు. ఈఘ‌ట‌న‌లో అన్ని విదాలుగా విచార‌ణ జ‌రుపుతున్నారు. త‌న
ప్రియుడ్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఆమెకు ఎవ‌రితో అయినా వివాదాలు ఉన్నాయా అని కూడా ఆమె స్నేహితుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు.