ఈ కానిస్టేబుల్ కు సెల్యూట్ చేస్తున్న దేశ ప్రజలు

209

గతంలో కేరళ వరదల సమయంలో ఓ జవాన్ చిన్నపిల్లవాడిని తన భుజం పై ఎత్తుకుని, వరద ప్రవాహం ఎంత స్పీడుగా వస్తున్నా, దానిని లెక్కచేయకుండా దాటుకుంటా రియల్ బాహుబాలిగా మారాడు.. అలా దాదాపు కిలో మీటర్ వరకూ వెళ్లి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు.. రియల్ బాహుబలి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అంతేకాదు ఎలాంటి సమస్యలు ప్రజలకు వచ్చినా ముందుకు వచ్చేది ఆర్మీ పోలీసులు రెస్కూ టీమ్.. ముఖ్యంగా వరదల సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడతారు ఈ టీమ్, కాని ఆ సమయంలోనే వారిని గుర్తు ఉంచుకుంటాం, తర్వాత మర్చిపోతాం.

Image result for police in kerala floods time

వారు లేకపోతే అసలు మనం లేము అనేలా వరదల్లో చాలా మంది తమ ప్రాణాలు కాపాడిన రియల్ హీరోస్ అని చెబుతూ ఉంటారు… చాలా మందిని ఇలా జవాన్లు ఆర్మీ రెస్కూ టీం కాపాడుతుంది…తాజాగా ఏపీ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 24 గంటల్లో 16గంటలు డ్యూటీలోనే ఉంటున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ వారిని కాపాడుతున్నారు.. కాజ్ వేల గుండా దాదాపు వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు ఆగిపోతున్నాయి.. అయితే గతంలో బాహుబలి విషయం ఎంత వైరల్ అయిందో, ఇప్పుడు ఓ పోలీస్ చేసిన సాయం కూడా అంతే వైరల్ అవుతోంది. మరి ఆ విషయం ఏమిటి ఆ పోలీస్ చేసిన సాహసం తెలుసుకుందాం.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమవుతోన్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్‌ పోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అలా వెళ్లిన సిబ్బందికి వరదలో చిక్కుకోని ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు.

Image result for police in kerala floods time

నీళ్లల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన సీఎం.. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి అంటూ ట్వీట్ చేశారు. ఆయనపై సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. అంతేకాదు అంత డేరింగ్ ఉన్న పోలీస్ కి మంచి పోస్ట్ ఇవ్వాలి అని కోరుతున్నారు, ఇలాంటి మనసున్న మహారాజులు ఉద్యోగంలో ఉండటం వల్లే ఇప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు అని కితాబిస్తున్నారు. నిజంగా మనం కూడా ఆ పోలీస్ కు సెల్యూట్ చేద్దాం. మరి అతని సాహసం పై మీ అభిప్రాయాలన కామెంట్ ల రూపంలో తెలియచేయండి.