సురేష్ మొబైల్ ఫోన్ లో బయటపడుతున్న సంచలన విషయాలు షాకైన పోలీసులు

467

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆఫీసులోనే పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.. నిందితుడు సురేష్ పై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఐపీసీ 302,307,333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.నిందితుడు సురేశ్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం నిందితుడు సురేశ్ పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు సురేశ్ శరీర అవయవాలు తీవ్రంగా కాలిపోయాయని సురేశ్ బ్రతకటం కష్టమేనని ఉస్మానియా వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Related image

పోలీసులు ఇప్పటికే సురేశ్ మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. నిందితుడు సురేశ్ భూవివాదంలో తగిన న్యాయం జరగకపోవటం వలన ముందుగానే రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడ్డానని పోలీసులకు వాంగ్మూలంలో చెప్పాడు. సురేశ్ తన మొబైల్ లో కొన్ని వాయిస్ కాల్స్ రికార్డ్ చేసుకున్నాడు. అందులోని సంబాషణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ కాల్ డేటాను పోలీసులు పూర్తిగా విశ్లేషించారు. సురేశ్ చివరిసారిగా ఒక రియల్టర్ కు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్, నిందితుడు తిరిగిన ప్రాంతాల గురించి పోలీసులు వివరాలు సేకరించినట్లు సమాచారం. సురేశ్ తహశీల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరాలు పని చేయటం లేదని ముందుగానే గుర్తించినట్లు సమాచారం అందుతోంది. ఆరు నెలల నుండి సురేశ్ స్థిరాస్థి వ్యాపారం చేసేవాడని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తరువాత సురేశ్ చూసే వాళ్లంతా పిచ్చోడని భ్రమ పడే విధంగా దుస్తులు విప్పేసి ప్రధాన మార్గం గుండా బయటకు నడుచుకుంటూ వచ్చాడని తెలుస్తోంది. మార్గమధ్యంలో పోలీసులకు సురేశ్ ఎదురుపడినా పిచ్చోడని భావించి పట్టించుకోలేదు. సురేశ్ పక్కా ప్రణాళికతోనే తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేశాడని తెలుస్తోంది. గౌరెల్లి గ్రామస్తులు సురేశ్ రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావంతో ఉండేవాడని తహశీల్దార్ ను సురేశ్ హత్య చేయటం వెనుక ఎవరో ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్ గతంలో కూడా గ్రామ సభల్లో రెవిన్యూ అధికారులతో గొడవ పడ్డాడని తెలుస్తోంది. అంతేకాకుండా గత వారం రోజులుగా సురేష్ ఎక్కడకు వెళ్లాడు ఎవరిని కలిశాడు అనేది కూడా చూస్తున్నారు పోలీసులు, అలాగే సురేష్ వాట్సాప్ మెసెజులు కూడా చెక్ చేస్తున్నారు, అయితే ఈ కేసులో మరింత మంది దోషులు ఉంటారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఈ క్రింద వీడియో చూడండి