అన్న పోలీసు, చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు ఎదురుకాల్పులు ఎంత దారుణం జరిగిందో తెలిస్తే కన్నీరే

92

అన్నాచెల్లెల్ల వింత గాధ ఇది. ఒకే తల్లికి పుట్టిన ఆ అడవి బిడ్డల సిద్ధాంతాలు వేర్వేరు. అన్న పోలీసుగా మారి ప్రజలకు సేవలందిస్తుంటే.. చెల్లి మావోయిస్టుగా అడవి బాట పట్టింది. అన్నను వదిలి అన్నలతో కలిసి ఉద్యమిస్తోంది. ఇటీవల ఆ అన్నాచెల్లెల్లు ఎదురుపడ్డారు. అప్యాయంగా పలకరించుకోడానికి బదులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. నిజంగా ఇలాంటి పరిస్దితి ఎవరికి రాకూడదు అని వారు భావించి ఉంటారు కాని వారి సిద్దాంతాలు వేరు వారి భావజాలాలు వేరు అందుకే వారు తమ జీవితాలలో అనుకున్న స్ధానాలకు వెళుతున్నారు. ఆమె ప్రజల కోసం ఉధ్యమంలోకి వెళితే అన్న ప్రజాసేవ కోసం పోలీసుగా మారాడు.చత్తీస్‌ఘడ్‌‌కు చెందిన కమాండర్ వెట్టి రామ ఆధ్వర్యంలో జులై 29న 140 మంది పోలీసులు సుక్మా జిల్లాలోని బలేంగ్తాన్‌లో మావోయిస్టుల క్యాంపును చుట్టుముట్టారు. కొంటా ప్రాంతానికి చెందిన సీపీఎం (మావోయిస్టు) కమిటీకి చెందిన ముఖ్య సభ్యుల కోసం జల్లెడపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళా మావోయిస్టు రామ కంటపడింది. ఆమె మరెవ్వరో కాదు.. వెట్టి రామ చెల్లి వెట్టి కన్నీ.

వెట్టి కన్నీపై రామ కాల్పులు జరపలేదు. ఆమెను లోంగిపోవాలని కోరాడు. అయితే, కన్నీకి భద్రతగా ఉన్న మిగతా సభ్యులు రామపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు అతడు కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఎదురు కాల్పులు జరిపేసరికి ఆమె అక్కడ నుంచి దట్టమైన అడవుల్లోకి పారిపోయింది. అయితే లొంగిపోతారు అని భావించాడు కాని వారు ఎవరూ లొంగలేదు చెల్లె చుట్టు ఉన్న సభ్యులు కాల్పులు కొనసాగిస్తూనే ముందుకు వెళ్లారు.గగన్‌పల్లి గ్రామానికి చెందిన రామ, కన్నీలు 1990లో మావోయిస్టుల ఉద్యమంలో చేరారు. సంఘం అనే బాలల దళంలో చేరిన ఆ ఇద్దరూ మావోయిస్టుల సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెట్టి రామ మాట్లాడుతూ.. అప్పటితో పోల్చితే మావోయిస్టు ఉద్యమంలో చిత్తశుద్ధి లోపించింది. అందుకే 2018లో నేను పోలీసులకు లొంగిపోయాను. కానీ చెల్లి మాత్రం దళంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత పోలీసులతో కలిసి 10 భారీ ఆపరేషన్లలో పాల్గొన్నాను. కొద్ది నెలల తర్వాత నాకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అని తెలిపారు.

ఈ క్రింద వీడియో చూడండి

మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో చెల్లి కన్నీ ఎదురైంది. ఆమెపై కాల్పులు జరపాలని నేను అనుకోలేదు. కానీ, సెకన్ల వ్యవధిలో ఆమె గార్డులు నన్ను, టీమ్‌ను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమె కూడా కాల్పులు జరుపుతూ అడవిలోకి వెళ్లిపోవడం చూశాం అని రామ తెలిపారు. మావోయిస్టు దళంలో కీలక నేతగా ఎదిగిన కన్నీ తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. తను మరోసారి కనిపిస్తే ఈసారి వదిలేది లేదని తనలా పోలీసులకు లొంగిపోవాలని చెబుతా అంటున్నాడు ఈ అన్నయ్య, అయితే ఆమె మాత్రం తన సోదరుడిలా తాను కాదు అని చెబుతోంది.
మరి, ఆ అన్నా చెల్లెల్లు తిరిగి కలుస్తారా, లేదా కలవకుండానే కథ ముగుస్తుందా అనేది కాలమే చెబుతుంది. మరి ఈ అన్న చెల్లెలు స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.