క్యాట‌రింగ్ పేరు చెప్పి అశ్లీల నృత్యాలు చేయించి చివ‌ర‌కు ఏం చేశారో తెలిస్తే షాక్

365

గ‌తంలో రికార్డింగ్ డ్యాన్సులు బాగా జ‌రిగేవి, త‌ర్వాత తర్వాత కొబ్బ‌రి తోటల్లో, అలాగే గ్రామాలకు చివ‌ర ప్రాంతాల్లో ఈ రికార్డింగ్ ట్రూపు డ్యాన్సులు పెట్టేవారు. ఇక త‌ర్వాత రోజుల్లో ఈ డ్యాన్సులు చివ‌ర‌కు అశ్లీల నృత్యాల్లా మారాయి. అలా వారి ఉపాధిని కూడా కొంద‌రు నాశనం చేశారు. తాజాగా ఇలాంటి వారిది స‌రికొత్త దందా మొద‌లైంది. కొంద‌రు మైన‌ర్ బాలిక‌ల‌ను ఇలా అశ్లీల నృత్యాలు చేయించేందుకు తీసుకువ‌స్తున్నారు వేలాది రూపాయ‌లు వారికి ఆశ‌చూపించి కొంద‌రు యువ‌తుల‌ను ఇలాంటి చీక‌టి రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. దీంతో పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Image result for MARRIAGE

క్యాటరింగ్ పనుల పేరుతో ఓ మైనర్ బాలికతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నఇద్దరు వ్యక్తులను సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.నగరంలోని సింగ్ నగర్ కు చెందిన ఏడో తరగతి చ‌దువుకున్న ఓ అమ్మాయి ఇంటి ద‌గ్గ‌రే ఉంటోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ కేటరింగ్ సంస్థ నిర్వాహకుడు మోనీ తన వద్ద పని చేసేందుకు కూతురును పంపాల్సిందిగా యువ‌తి త‌ల్లితండ్రులను కోరాడు. కేటరింగ్ పనుల కోసం బాలికను 20 రోజుల కిందట విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్ళాడు.

Image result for MARRIAGEమాయమాటలు చెప్పి అనకాపల్లికి చెందిన రికార్డింగ్ డ్యాన్స్ నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలకు బాలికను అప్పగించాడు. అప్పటి నుంచి బాలికను తమ ట్రూప్‌లోని ఇతర యువతులతో కలిపి బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించడం మొదలు పెట్టారని పోలీసులు తెలిపారు. 20 రోజుల పాటు నరకం అనుభవించిన బాలిక ఆ గ్యాంగ్ నుండి తప్పించుకుని విజయవాడకు చేరుకుందనీ, అదేక్రమంలో బాలిక తల్లి కూడా తన కుమార్తె ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేసిందని సింగ్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈలోగా బాలిక కూడా ఇంటికి చేరడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు డాన్స్‌ ట్రూప్‌పై దాడి చేసి నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ప్రమేయమున్న మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా మాయ‌మాట‌లు చెప్పి వేల రూపాయ‌లు ఆశ‌చూపి, కొంద‌రు అమ్మాయిలని బ‌ల‌వంతంగా ఇలాంటి ప‌నులు చేయిస్తున్నారు, మ‌రికొంద‌రు దీనిపై ఎటువంటి అనుమానం రాకుండా తల్లిదండ్రుల‌కు డ‌బ్బు ఆశ‌చూపి అడ్వాన్సులు ఇచ్చి, వారిని తీసుకువెళుతున్నారు. ఇక తూర్పుగోదావ‌రి విశాఖ‌లో ఇలాంటి కొన్నిముఠాలు ఉన్నాయని, వారి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని పోలీసులు చెబుతున్నారు, ఇంకా ఇలాంటి అమ్మాయిలు ఎవ‌రైనా ఉంటే వారికి కూడా విముక్తి క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు పోలీసులు. చూశారుగా ఇలాంటి డ్యాన్సులు అశ్లీల నృత్యాలు మీ ద‌గ్గ‌ర్లో జ‌రిగితే, పోలీసుల‌కు తెలియ‌చేయండి, అమాయ‌క యువ‌తుల‌కు విముక్తి క‌లిపించండి, ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.