పుల్వామా ఘ‌ట‌న‌తో ఎన్నిక‌ల‌పై మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం

243

సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పుల్వామా లో భార‌త జ‌వాన్ల పై ఉగ్ర‌వాదుల దాడి..సైనికుల మ‌ర‌ణం త‌రువాత దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌తీకార దాడుల దిశ‌గా కేంద్రం ఆలోచ‌న చేస్తోంది. దీంతో..ముందుగా అంచ‌నా వేసిన దాని కంటే ఎన్నిక‌ల షెడ్యూల్ మ‌రింత ఆలస్యం అయ్యే ప‌రిస్థితి నెల‌కొంది.సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ పై పుల్వామా ఘ‌ట‌న ఎఫెక్ట్ చూపిస్తోంది. వాస్త‌వానికి ఈ నెలాఖ‌రు లేదా మార్చి మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తోంది… దీని కోసం అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. రాష్ట్ర సీఈవోలతో స‌మావేశాలు ఏర్పాటు చేసింది. ఈవీయంల‌తో పాటుగా భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపైనా దృష్టి సారించింది. అయితే, పుల్వామాలో జ‌రిగిన ఘ‌ట‌న త‌రువాత ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నోభావాలు గాయప‌డ్డాయి.

Image result for pulwama

జ‌వాన్ల పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన ఘ‌ట‌న‌లో 40 మందికి పైగా జ‌వాన్లు అశువులు బాసారు. దీంతో..ఖ‌చ్చితంగా ఉగ్ర‌వాదుల పైనా..వారికి మ‌ద్ద‌తుగా నిలిచిన వారి పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఒత్తిడి దేశ వ్యాప్తంగా పెరుగుతోంది. ఇదే కోణంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ప్ర‌తీకార దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చరికలు చేస్తోంది. దీంతో..సైనిక చ‌ర్య ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ ప‌రిణామాల పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. దేశ భ‌ద్ర‌త ప‌రంగా కేంద్రం సైనిక చ‌ర్య విష‌యంలో ఏ ర‌కంగా ముందుకు వెళ్తుందో చూసి..దానికి అనుగుణంగా ఎన్నిక‌ల షెడ్యూల్ పై నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

ఎన్నిక‌ల షెడ్యూల్ వాస్తంగా ముందుగా అనుకున్న ప్ర‌కారం ఈ నెలాఖ‌రు లేదా మార్చి తొలి వారంలో విడుద‌లకు ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. అయితే, లోక్‌స‌భ ఎన్నిక‌లతో పాటుగా ఏపి, మ‌హారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీనికి అన్ని ర‌కాలుగా ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్తం అవుతోంది. జూన్ 5వ తేదీ నాటికి ప్ర‌స్తుత 16 వ లోక్‌స‌భ స‌మ‌యం ముగిసి..ఆ రోజుకు కొత్త‌గా 17వ లోక్‌స‌భ కొలువు తీరాల్సి ఉంది.దీనికి త‌గిన‌ట్లుగానే మార్చి తొలి వారంలో షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ 20 నుండి మే 20లోగా ద‌శ‌ల వారీ గా ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం సైనిక చ‌ర్య విష‌యంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసిన త‌రువాత షెడ్యూల్‌..ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం మేర‌కు షెడ్యూల్ ప‌ది రోజులు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది.