విమానంలో పురిటి నొప్పులు.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

253

గర్భవతి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. లేకుంటే వారికి ఎప్పుడు పురిటినొప్పులు వచ్చినా పెద్ద సమస్య అవుతుంది. అలాగే గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చెయ్యడం కూడా మంచిది కాదు. భూమి మీద ప్రయాణం అంటే ఏమి కాదు ఎందుకంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ లు తీసుకెళ్లి ఆమెకు ప్రసవం చెయ్యవచ్చు. కానీ విమానంలో ప్రయాణం అంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే విమానంలో ప్రసవం చెయ్యడం కష్టం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఒక మహిళకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. మరి ఆ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింద వీడియో చూడండి

దుబాయి నుంచి మనీలా వెళ్తోందా విమానం. ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఆ విమానంలో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే విమానంలో మనీలాకు చెందిన సెరిడా అనే 37 వారాల నిండు గర్బవతి ప్రయాణిస్తున్నారు. ఇక విమానం బయలుదేరింది. ఇంతలో గర్భవతి మహిళ పెద్దగా కేకలు వేయసాగింది. ఏం జరిగిందని వెళ్లిన విమాన సిబ్బంది ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని అర్థం చేసుకున్నారు. ఆమెకు సపర్యలు చేయసాగారు. ఆ సమయంలో సాటి ప్రయాణికులు పురిటి నొప్పులు వస్తున్న మహిళకు ఏమి కాదని ధైర్యం చెప్పి మానవత్వం చాటుకున్నారు. విషయం తెలుసుకున్న పైలెట్ మార్గమధ్యంలో శంషాబాద్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ఎయిర్‌పోర్టు అధికారులను పైలట్‌ అనుమతి కోరాడు.

Related image

పైలెట్ అనుమతి ఇవ్వడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపారు. ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించడంతో విమానాశ్రయంలో ఉన్న మెడికల్ సెంటర్ రెడీ చేశారు. ఎయిర్ పోర్టు మెడికల్ సెంటర్ కు చెందిన అంబులెన్స్ లో ఈమెను తీసుకువెళ్తుండగా వాహనంలోనే కాన్పు జరిగింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్‌ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. పరిస్థితి సంక్లిష్టంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్‌ ఆస్పత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో తక్షణ చికిత్స లభించడంతో తల్లీ బిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ విధమైన కేసులు తమ ఆసుపత్రికి నెలకు అయిదారు వస్తుంటాయని డాక్టర్లు తెలిపారు. ఇక విమానం మనీలా వెళ్ళిపోయింది. మహిళను తర్వాత మరొక విమానంలో పంపిస్తాం అని అధికారులు చెప్పారు. మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.