పాక్ చేతికి చిక్కిన పైలెట్ విక్రమ్ అభినందన్ గురించి పూర్తీగా తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

333

పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. భారత పైలట్‌ విక్రమ్ అభినందన్ తమకు పట్టుబడినట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్‌ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అభినందన్‌ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు.గాయాలపాలైన అభినందన్‌పై జాలి, దయ చూపకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. పాక్‌ సైనికులు ఆయనను చుట్టుముట్టి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. చిత్ర హింసలు పెట్టారు.

Image result for abhinandan

భారత వింగ్ కమాండర్‌పై పాక్ ఆర్మీ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పాక్ మీడియా రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి.ప్యారాచూట్ ద్వారా ల్యాండ్ అయిన సమయంలో విక్రమ్ ఎలాంటి గాయాలతో లేడు. సురక్షితంగా ఉన్నాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాతే.. చిత్రహింసలు పెట్టారు. యుద్ధ ఖైదీని గౌరవించాలన్న కనీస నీతి పాటించలేదు. గౌరవంగా చూడాలన్న జ్ణానం ప్రదర్శించలేదు. రక్తమోడుతున్న గాయాలు ఉన్నా.. ముఖంలో చిరునవ్వు మాత్రం చెరగలేదు. ఎంతో ధీమాగా సమాధానం చెప్పాడు పైలెట్ అభినందన్. తన వివరాలు వెల్లడించటంతోపాటు.. తన లక్ష్యాన్ని మాత్రం చెప్పలేదు.

Image result for abhinandan

పాక్ సైన్యానికి పట్టుబడ్డ అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. ఆయన తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్. తమిళనాడు ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్ చదివారు. ప్రస్తుతం తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్నారు. ఐఏఎఫ్‌ అకాడమీలో ఉంటున్న విక్రమ్‌ అభినందన్‌ తండ్రి కూడా ఎయిర్‌ మార్షల్‌ పని చేశారు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. దేశంపైకి దండెత్తిన శత్రు విమానాలను వెంటాడుతూ దాయాది దేశానికి పట్టుబడ్డ ఆయన చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు. విక్రమ్ అభినందన్ ను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్న వీడియోను చూపించొద్దు అంటూ మీడియాతోపాటు సోషల్ మీడియాను కోరారు అతని తల్లిదండ్రులు. ఈ ఒక్క వీడియో వల్ల దేశం మొత్తం వెనక్కి తగ్గినట్లు చిత్రీకరించే ప్రమాదం ఉందని.. ఎందరో మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అన్నారు. ఆ వీడియోను చూపించొద్దు అని కోరారు వారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని ఆయన మేనమామ గుంగనాధన్ విజ్ఞప్తి చేశారు. మేనల్లుడిని తన చేతులతో పెంచానని టీవీల్లో వస్తున్న ఫొటోలు, వీడియోలు అభినందన్‌వేనని తెలిపారు. అభినందన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీరు ఢిల్లీలో ఉంటున్నారని చెప్పారు. దౌత్యపరం‍గా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్‌ ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయిద్‌ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది.విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని కోరుకుందాం. మరి విక్రమ్ అభినందన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.